రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

గురు జంభేశ్వర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి

Posted On: 10 MAR 2025 1:20PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు (మార్చి 10హర్యానాలోని హిసార్‌లో గురు జంభేశ్వర్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు

ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి మాట్లాడుతూ.. మారుతున్న ప్రపంచ డిమాండ్లకు అనుగుణంగా యువతరాన్ని సన్నద్ధం చేయడం సవాలుతో కూడుకొన్న పని అన్నారుదేశం సమతుల్యమైనదీర్ఘకాలం పాటు కొనసాగగల అభివృద్ధిని సాధించాలంటే విద్యా ప్రయోజనాలతోపాటు టెక్నాలజీ ప్రయోజనాలు సైతం గ్రామాలకు విస్తరించాలని ఆమె సూచించారుఈ విషయంలో గురు జంభేశ్వర్ విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థలు చాలా ప్రధానమైన పాత్రను పోషించాల్సి ఉందన్నారుఈ విశ్వవిద్యాలయంలో చిన్న పట్టణాలకు చెందిన విద్యార్థులుగ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిసి తాను సంతోషిస్తున్నానని రాష్ట్రపతి అన్నారుచదువు ప్రాముఖ్యాన్ని పల్లె ప్రజలుపట్టణ ప్రజలు తెలుసుకొనేటట్లు చేయాలని ఆయా ప్రాంతాల విద్యార్థులకు రాష్ట్రపతి సూచించారు.  

ఉన్నత విద్య సంస్థలలో నిర్వహించే ప్రపంచ స్థాయి పరిశోధనలు మన దేశాన్ని ప్రపంచంలో జ్ఞ‌ాన ప్రధాన మహాశక్తిగా నిలబెట్టగలుగుతాయని రాష్ట్రపతి అన్నారువిభిన్న పరిశోధనపరిశోధన పథకాల్లో చెప్పుకోదగ్గ విజయాలనెన్నింటినో ఈ విద్యాసంస్థ విద్యార్థులుఫేకల్టీ సభ్యులు చేజిక్కించుకొన్నారని తెలిసి తనకు సంతోషం కలిగిందని రాష్ట్రపతి అన్నారుఈ సంస్థలో ఇన్‌క్యూబేషన్అంకుర సంస్థపేటెంట్ దాఖలుపరిశోధన పథకాలు వంటి విశిష్ట విభాగాలున్నాయి.. ఈ ప్రయత్నాలన్నీ కలసి విద్యార్థుల్లో నవకల్పనలకు సంబంధించిన ఉత్సాహాన్నీఔత్సాహిక పారిశ్రామికత్వ స్ఫూర్తినీ నింపి భారత్‌ను ప్రపంచ జ్ఞ‌ాన మహాశక్తిగా ఆవిష్కరించడంలో సాయపడగలుగుతాయన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.

విద్య జ్ఞ‌ానాన్నీనైపుణ్యాలనూ సంపాదించుకొనే మార్గం ఒక్కటే కాదని విద్యార్థులకు రాష్ట్రపతి చెప్పారువిద్య... నైతికతకరుణసహనం వంటి జీవన విలువలను మనిషి పెంపొందించుకోవడానికి ఒక సాధనం కూడా అని ఆమె ఉద్బోధించారువిద్యార్జన ఒక వ్యక్తిలో బతుకుతెరువును సంపాదించుకొనే అర్హతను కలగజేయడానికి తోడుసామాజిక బాధ్యతల విషయంలో కూడా ఆ వ్యక్తిలో చైతన్యాన్ని ఏర్పరుస్తుందన్నారు.  ఔత్సాహిక పారిశ్రామికత్వం విద్యార్థులకు వారి సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో సహాయపడుతుందని రాష్ట్రపతి చెప్పారుఔత్సాహిక పారిశ్రామికత్వ ప్రధాన మనస్తత్వం వారికి అవకాశాలను గుర్తించేరిస్కులు తీసుకొనేసమస్యలకు చక్కని పరిష్కారాలను అన్వేషించే  సామర్ధ్యాన్ని సమకూరుస్తుందన్నారుఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా వారు తమ కొత్త కొత్త ఆలోచనలతో సామాజిక సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలుగుతారనిసమాజ ప్రగతికి దోహదపడగలుగుతారన్నారువిద్యార్థులు ఉద్యోగాన్ని దక్కించుకోవాలనుకొనే కన్నాఉద్యోగావకాశాన్ని కల్పించాలనే మనస్తత్వాన్ని అలవరచుకోవాలని ఆమె సూచించారుఈ తరహా మనస్తత్వాన్ని అలవరచుకొని ముందుకు సాగితే వారు తమ జ్ఞ‌ానాన్నీనైపుణ్యాలనూ సమాజ సంక్షేమానికి మెరుగైన పద్ధతిలో ఉపయోగించగలగడంతోపాటు భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మలచడంలో తోడ్పడగలుగుతారని ఆమె అన్నారు.

గురు జంభేశ్వర్ జీ గౌరవార్ధం ఈ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టారని రాష్ట్రపతి చెబుతూగురూజీ ఒక గొప్ప సంత్దార్శనికుడు అని కొనియాడారుఆయన శాస్త్రీయ ఆలోచనవిధానంనైతిక జీవనశైలిపర్యావరణ పరిరక్షణలను గట్టిగా సమర్థించారని ఆమె గుర్తుచేశారుప్రకృతిని సంరక్షించడంఅన్ని ప్రాణుల పట్ల దయనుకరుణను కలిగి ఉండడంవాటికి అభయప్రదానం చేయడం.. ఇవి మానవుల నైతిక బాధ్యతలు అని ఆయన నమ్మారన్నారు.  ప్రస్తుతంమనం పర్యావరణ సమస్యలకు పరిష్కారాలను కనుగొనే ప్రయత్నాలు చేస్తున్న వేళ.. గురు జంభేశ్వర్ జీ ప్రబోధాలు చాలా యోగ్యమైనవి అని చెప్పాలివిశ్వవిద్యాలయ అధ్యాపకవర్గంవిద్యార్థులు గురు జంభేశ్వర్ జీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ ప్రగతికిదేశ ప్రగతికి తమ వంతు తోడ్పాటును అందిస్తూ ఉంటారన్న విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.   

Please click here to see the President's Speech - 

 

***


(Release ID: 2109875) Visitor Counter : 16