సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
యానిమేషన్ చిత్రనిర్మాణ పోటీ
యానిమేషన్ రంగంలో సృజనాత్మకత-ఆవిష్కరణలకు ప్రోత్సాహం
Posted On:
09 MAR 2025 12:05PM by PIB Hyderabad
యానిమేషన్ రంగంలో సృజనాత్మకత-ఆవిష్కరణలకు ప్రోత్సాహం
పరిచయం
యానిమేషన్ రంగంలో భారత కథకులకు ప్రాచుర్యం, సాధికారత కల్పన లక్ష్యంగా వినూత్న రీతిలో యానిమేషన్ చిత్రనిర్మాణ పోటీ నిర్వహణ పూర్తియింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీలో భాగంగా తమ సృజనాత్మకత-ఆవిష్కరణాత్మకత ప్రదర్శించేందుకు చిత్రనిర్మాతలకు అవకాశం లభించింది. ప్రేక్షకులను ఆకట్టుకునే అసలుసిసలు యానిమేషన్ చిత్రాల ప్రదర్శనకు ఇదొక వేదిక. ‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో భాగంగా వినూత్న సహకార ఒప్పందం ద్వారా యానిమేషన్ రంగంలో అగ్రగామి సంస్థ ‘డాన్సింగ్ ఆటమ్స్’తో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ ఈ పోటీల నిర్వహణకు జట్టుకట్టింది.
‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్) ప్రారంభ సంచికలో భాగంగా మీడియా-వినోద రంగాలు ఏకీకృతమయ్యే ప్రత్యేక ‘కూడలి-విభాగాల వేదికగా ‘వేవ్స్’ ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మీడియా-వినోద పరిశ్రమ దృష్టిని భారత్ వైపు మళ్లించడం, భారతీయ మీడియా-వినోద రంగం విస్తృత ప్రతిభాపాటవాలతో దాన్ని అనుసంధానించడమే ఈ కీలక ప్రపంచ స్థాయి కార్యక్రమ లక్ష్యం.
ముంబయిలోని ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్-జియో వరల్డ్ గార్డెన్స్‌లో 2025 మే 1 నుంచి 4 వరకు ‘వేవ్స్’ కొనసాగుతుంది. “బ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్‌మెంట్, ఎవిజిసి-ఎక్స్‌ఆర్ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ), డిజిటల్ మీడియా-ఇన్నోవేషన్, ఫిల్మ్స్ (చలనచిత్రాలు)” నాలుగు కీలక మూలస్తంభాలుగా ‘వేవ్స్’కు రూపకల్పన చేశారు. భారత వినోద పరిశ్రమ భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా ప్రపంచవ్యాప్త అగ్రగాములు, సృష్టికర్తలు, సాంకేతిక నిపుణులను ‘వేవ్స్’ సమీకృతం చేస్తుంది.యానిమేషన్ చిత్ర నిర్మాణ పోటీ
కింది ప్రమాణాల ఆధారంగా న్యాయనిర్ణేతలు చిత్రాలను మూల్యాంకనం చేస్తారు.
వాస్తవ కథ
వినోదం
మార్కెట్‌లో ప్రాచుర్యం
ప్రేక్షకులను ఆకట్టుకోవడం
మూలభావనను ప్రదర్శించిన తీరు
బహుమతులు
మాస్టర్ క్లాసులు - మెంటార్ షిప్: నిపుణులు నిర్వహించే వేదికలు, వ్యక్తిగత మార్గదర్శకత్వం ద్వారా పోటీదారులు తమ మూలభావనను మెరుగుపరచుకుంటారు.
తుది ప్రదర్శన కార్యక్రమం: వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ (వేవ్స్)లో తుది ప్రదర్శనతో పోటీ ముగుస్తుంది.
నగదు బహుమతులు: గెలుపొందిన ప్రాజెక్టుల నిర్మాతలకు రూ.5 లక్షల దాకా నగదు బహుమతులు లభిస్తాయి.
ప్రయాణ అవకాశం: విజేతలకు 2025 మే 1 నుంచి 4 వరకూ ముంబయిలో నిర్వహించే ‘వేవ్స్’ వేడుకలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.
పరిశ్రమ అగ్రగాముల ముందు ప్రదర్శన: తుది దశకు చేరిన పోటీదారులు తమ చిత్రాలను చలనచిత్ర-టీవీల నిర్మాతలు, పెట్టుబడిదారులు పరిశ్రమ అగ్రగాముల ఎదుట ప్రదర్శించే అవకాశం లభిస్తుంది.
అంతర్జాతీయ ప్రాచుర్యం: విజేతల కథలు, చిత్రాలకు జాతీయ, అంతర్జాతీయ మీడియా ద్వారా విశేష ప్రాచుర్యంతోపాటు విస్తృత గుర్తింపు కూడా లభిస్తుంది.
యానిమేషన్ రంగంలో ఔత్సాహికులే కాకుండా నిపుణులు కూడా తమ సృజనాత్మక ఆలోచనలను ప్రదర్శించేందుకు ఈ యానిమేషన్ చిత్రనిర్మాణ పోటీ ఒక విశిష్ట అవకాశం. నిపుణుల మార్గదర్శకత్వం, మాస్టర్ క్లాస్‌ల తోడ్పాటుతో పరిశ్రమ అగ్రగాములకు తమ ప్రాజెక్టులను ప్రదర్శించే వీలు కలుగుతుంది కాబట్టి, మరింత ప్రయోజనం పొందుతారు. ఇక విజేతలకు అద్భుతమైన బహుమతులేగాక ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా లభిస్తుంది.
ముగింపు
ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతను రుజువు చేసుకునే అమూల్య వేదికను ఈ యానిమేషన్ చిత్రనిర్మాణ పోటీ సమకూరుస్తుంది. అలాగే మార్గదర్శకత్వం, మాస్టర్‌క్లాస్ ద్వారా పరిశ్రమ అగ్రగాములకు తమ చిత్రాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. తుది ఎంపిక దగ్గర పడుతున్న నేపథ్యంలో భారత యానిమేషన్ రంగంలో సృజనాత్మకత- ఆవిష్కరణలను ఈ పోటీ ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది.
****
(Release ID: 2109762)
Visitor Counter : 13