సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

ట్రూత్‌టెల్‌ హ్యాకథాన్‌


కృత్రిమ మేధ సాయంతో అవాస్తవ సమాచార వ్యాప్తి నిరోధం

Posted On: 07 MAR 2025 11:42AM by PIB Hyderabad

 

పరిచయం

   ఈ ‘క్రియేట్‌ ఇన్‌ ఇండియా ఛాలెంజ్‌ సీజన్‌-1’లో భాగంగా ‘ట్రూత్‌టెల్‌ హ్యాకథాన్‌’ (సత్య నిబద్ధత ప్రచారం) కార్యక్రమం రూపొందింది. ప్రత్యక్ష ప్రసారాల సమయంలో ఎప్పటికప్పుడు నిజ నిర్ధారణ కోసం శక్తిమంతమైన అత్యాధునిక కృత్రిమ మేధ (ఎఐ) ఉపకరణాల రూపకల్పనే దీని లక్ష్యం. ఇండియా సెల్యులర్‌-ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్ (ఐసిఇఎ), ఇండియా ‘ఎఐ’ మిషన్‌ వంటి ప్రసిద్ధ సంస్థలు, సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబి), ఎలక్ట్రానిక్స్‌-సమాచార సాంకేతికత మంత్రత్వశాఖ కేంద్ర ప్రభుత్వ శాఖల సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం కొనసాగనుంది. మీడియా, సాంకేతిక రంగాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ కీలక భాగస్వాములను ఒకే వేదికపైకి తేవడం ఈ హ్యాకథాన్‌ ధ్యేయం.

‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్‌) ప్రారంభ అంశాల్లో ఈ కార్యక్రమం ఓ ప్రధాన భాగం. ఈ తొలి భాగంలో మీడియా, వినోద రంగాలు ఏకీకృతమయ్యే ఒక ప్రత్యేక ‘కూడలి-విభాగాల’ వేదికగా ‘వేవ్స్‌’ ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మీడియా-వినోద పరిశ్రమ దృష్టిని భారత్‌ వైపు మళ్లించడం, భారతీయ మీడియా-వినోద రంగం విస్తృత ప్రతిభాపాటవాలతో దాన్ని అనుసంధానించడమే ఈ కీలక ప్రపంచ స్థాయి కార్యక్రమ లక్ష్యం.
   ముంబయిలోని ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్-జియో వరల్డ్ గార్డెన్స్‌’లో 2025 మే 1 నుంచి 4 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. “బ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్‌మెంట్, ఎవిజిసి-ఎక్స్‌ఆర్‌ (యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ), డిజిటల్ మీడియా-ఇన్నోవేషన్, ఫిల్మ్స్ (చలనచిత్రాలు)” నాలుగు కీలక మూలస్తంభాలుగా ‘వేవ్స్‌’కు రూపకల్పన చేశారు. భారత వినోద పరిశ్రమ భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా ప్రపంచవ్యాప్త అగ్రగాములు, సృష్టికర్తలు, సాంకేతిక నిపుణులను ‘వేవ్స్‌’ సమీకృతం చేస్తుంది.

   ఈ నేపథ్యంలో ‘ట్రూత్‌టెల్‌ హ్యాకథాన్‌’ తొలి కీలక స్తంభమైన ‘బ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్‌మెంట్‌’పై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఇప్పటిదాకా 186 అంతర్జాతీయ అభ్యర్థనలు సహా 5,650 మంది నమోదు చేసుకున్నారు.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ-కాల వ్యవధి

   అవాస్తవ సమాచార వ్యాప్తి నిరోధం, నైతిక పాత్రికేయ ప్రమాణాలకు ప్రోత్సాహం దిశగా కృత్రిమ మేధ (ఎఐ) ఆధారిత విధానాల రూపకల్పన లక్ష్యంగా ‘ట్రూత్‌టెల్ హ్యాకథాన్’ నిపుణులను ఆహ్వానిస్తోంది. ఈ పోటీల్లో వ్యక్తిగతంగా లేదా ఐదుగురు సభ్యుల బృందంగా రూపకర్తలు, డేటా సైంటిస్టులు, మీడియా నిపుణులు పాల్గొనవచ్చు. అయితే, 2025 ఫిబ్రవరి 21తో రిజిస్ట్రేషన్‌ గడువు ముగిసింది.

·         రిజిస్ట్రేషన్లు ప్రారంభం                                          :   2024 అక్టోబరు 1.
·         ఆలోచనలు-నమూనాల సమర్పణ గడువు        :  2025 ఫిబ్రవరి 21.
·         అగ్రస్థానంలో నిలిచిన 25 ఎంట్రీల ప్రకటన           :   2025 మార్చి 7.
·         మెంటారింగ్‌ - టింకరింగ్‌ ప్రక్రియ                     : 2025 మార్చి 8 నుంచి 18.
·         జ్యూరీ ఎదుట ప్రదర్శన-ఐదుగురు విజేతల ఎంపిక : 2025 మార్చి 24 నుంచి 28.
·         వేవ్స్‌ సమ్మిట్‌                                         : 2025 మే 1 నుంచి 4.

పోటీ విభాగాలు:

1.    సమాచార నిధి రూపకల్పన:
o   బాహ్య నిజ నిర్ధారణ ‘ఎపిఐ’ల తోడ్పాటుతో సమాచార విశ్లేషణ.
o   ముందస్తు పరిశీలన (ప్రీ-ప్రాసెస్), వాస్తవాధారిత మీడియా సారాంశం (టోకెనైజేషన్‌- సమాచార విభజన, (ఎంటిటీ ఎక్స్‌ట్రాక్షన్- వ్యక్తుల పేర్లు, ప్రదేశాలు, సంస్థలు, తేదీలు వంటి అంశాల గుర్తింపు).

2.    ప్రత్యక్ష ‘ఎన్‌ఎల్‌పి’ నమూనా రూపకల్పన:
o   అవాస్తవ సమాచార నిధికి సంబంధించి మెషీన్‌ లెర్నింగ్‌/డీప్‌ లెర్నింగ్‌ నమూనాలపై శిక్షణ  
o   ప్రత్యక్ష సమాచార విశ్లేషణ దిశగా ‘ఎన్‌ఎల్‌పి' మెలకువల (సమాచార వర్గీకరణ, సెంటిమెంట్‌ విశ్లేషణ, ఎంటిటీల గుర్తింపు) అమలు.

3.    నిజ నిర్ధారణ ఏకీకరణ:
o   హెచ్చరించిన సారాంశ ధ్రువీకరణ దిశగా బాహ్య నిజ నిర్ధారణ ‘ఎపిఐ’ల ఏకీకరణ.
o   విశ్వసనీయ విజ్ఞాన సమాచార నిధులతో పోల్చి చూడటం ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు.

4.    ప్రత్యక్ష సమాచార పరిశీలన:
o   ప్రత్యక్ష ప్రసార సారాంశం కోసం స్ట్రీమింగ్‌ మౌలిక సౌకర్యాల ఏర్పాటు.
o   కొత్త సమాచారం అందినపుడల్లా పరిశీలన కోసం డేటా పైప్‌లైన్ల అమలు.

5.    నిజ నిర్ధారణ కోసం విజ్ఞాన రేఖా చిత్రాలు:
o   ఎంటిటీలు, వాటి ధ్రువీకరణ స్థితి జాడతీసే దిశగా విజ్ఞాన రేఖాచిత్రాల రూపకల్పన,  అమలు.
o   అవాస్తవ సమాచార ధోరణుల గుర్తింపులో విజ్ఞాన రేఖాచిత్రాల వినియోగం.

6.    ప్రసార కర్తల కోసం తక్షణ సమాచార డాష్‌బోర్డు:
o   తక్షణ హెచ్చరికలు, విశ్వాస ప్రమాణాలు, ధ్రువీకృత సమాచారం ప్రదర్శించే ఇంటరాక్టివ్ డాష్‌బోర్డ్‌ ఏర్పాటు.

7.    పరీక్ష-ధ్రువీకరణ:
o   ప్రత్యక్ష లేదా రికార్డు చేసిన ప్రసారాలతో తనిఖీ
o   నిజ నిర్ధారణ సంస్థల క్షేత్రస్థాయి వాస్తవ సమాచారంతో కచ్చితత్వం ధ్రువీకరణ.

ప్రాజెక్టు సమర్పణ మార్గదర్శకాలు:

1.    లిఖిత ప్రతిపాదన:
o   ప్రాజెక్టు వివరణ: మీ ప్రతిపాదిత ఉపకరణం, దాని వినియోగిత లక్ష్యంపై సమగ్ర వివరణ సమర్పణ
o   సమస్య పరిష్కారం: మీ ఉపకరణం పరిష్కరించగల నిర్దిష్ట సమస్యలపై విస్పష్ట వివరణ.
o   లక్షిత ప్రేక్షకులు: మీ ఉపకరణానికి లక్షిత వినియోగదారులు లేదా లబ్ధిదారుల గుర్తింపు.
o   సాంకేతిక విధానం: హ్యాకథన్‌లో మీకు ఇచ్చిన ‘ఎపిఐ’లు, సమాచార నిధిపై దృష్టి సారిస్తూ మీరు వినియోగించిన విధానాలు, ఆల్గరిథంలు, సాంకేతికతలపై సంక్షిప్త వివరణ.

2.    నమూనా:
పరీక్ష ఉపకరణం నమూనా: మీ ఉపకరణం ప్రధాన సామర్థ్య ప్రదర్శన. ఇది వినియోగదారు హితం, క్రియాత్మకంగా ఉంటుందని, మీరు చూపే పరిష్కారం ప్రభావాన్ని ప్రదర్శిస్తుందని నిరూపించాలి.

o   పరిగణించాల్సిన కీలకాంశాలుః
·         పనితీరు: నిర్దేశిత విధి నిర్వహణకు హామీ
·         వాడకందారు అనుభవం: సహజ, వినియోగ సౌలభ్యంగల ఇంటర్‌ఫేస్‌ రూపకల్పన.
·         సమగ్రత: మీ ఉపకరణానికి అవసరమైన విశిష్టతల కూర్పు.
·         డాక్యుమెంటేషన్‌: మీ నమూనా వినియోగంపై విస్పష్ట సూచనలు.

3.    అదనపు చిట్కాలు:
o   విస్పష్ట, సంక్షిప్త భాషా వినియోగం.
o   మీ వివరణలను సాక్ష్యాలు, ఉదాహరణలతో రుజువు చేయండి.
o   మీ ప్రతిపాదన ఆకర్షణీయంగా ఉండేవిధంగా, చక్కని కూర్పుతో రూపొందేలా చూసుకోండి.
శక్తిమంతమైన ఉపకరణాలు - సాంకేతికతల సౌలభ్యం
   అవాస్తవ సమాచార నిరోధం కోసం వినూత్న ‘ఎఐ’ ఆధారిత ఉపకరణాల రూపకల్పన దిశగా ‘ట్రూత్‌టెల్ హ్యాకథాన్’ ఒక విశిష్ట అవకాశం కల్పిస్తుంది. ఇందులో పాలుపంచుకునే వారికి తమ ప్రాజెక్టుల రూపకల్పన కోసం శక్తిమంతమైన సాధనాలు, మార్గదర్శకత్వం, వనరుల లభ్యత ఉంటుంది. అవాస్తవ సమాచార నిరోధానికి ‘ఎఐ’ ఆధారిత పరిష్కారాల రూపకల్పన కోసం కింద పేర్కొన్న కొన్ని ప్రాచుర్యంగల సాధనాలు-సాంకేతికతలు అందుబాటులో ఉంటాయి:

·         ప్రోగ్రామింగ్ భాషలు:
o   పైథాన్ (టెన్సర్‌ఫ్లో, పైటార్చ్, ఎన్‌ఎల్‌టికె, స్కికిట్-లెర్న్ వంటి లైబ్రరీలతో)
o   ఆర్‌.జావా, జావాస్క్రిప్ట్‌
·         నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌ (ఎన్‌ఎల్‌పి లైబ్రరీలు):
o   టెన్సర్‌ఫ్లో టెక్స్ట్‌, హగ్గింగ్‌ ఫేస్‌ ట్రాన్స్‌ ఫార్మర్స్‌, స్పేసీ, జెన్‌సిమ్‌
·         మెషీన్‌ లెర్నింగ్‌ ఫ్రేమ్‌వర్క్స్‌:
o   టెన్సర్‌ఫ్లో, పైటార్చ్, కెరాస్‌
రూపకల్పన కోసం పరిగణించాల్సిన కీలకాంశాలు
o   పనితీరు: నిర్దేశిత విధి నిర్వహణకు హామీ
o   వాడకందారు అనుభవం: సహజ, వినియోగ సౌలభ్యంగల ఇంటర్‌ఫేస్‌ రూపకల్పన.
o   సమగ్రత: మీ ఉపకరణానికి అవసరమైన విశిష్టతల కూర్పు.
o   డాక్యుమెంటేషన్: మీ నమూనా వినియోగంపై విస్పష్ట సూచనలు.

మూల్యాంకన విధానం

ట్రూత్‌టెల్ హ్యాకథాన్ మూల్యాంకన ప్రమాణాలు కిందివిధంగా ఉంటాయి:
1.    ఆవిష్కరణ: పరిష్కారం వాస్తవికత-సృజనాత్మకత.
2.    ప్రభావం: అవాస్తవ సమాచార నిరోధంలో గణనీయ ప్రభావం చూపగల సామర్థ్యం.
3.    సాంకేతిక అర్హత: కోడ్ నాణ్యత, డేటా విశ్లేషణ, ‘ఎఐ’ల అమలు.
4.    వినియోగ సామర్థ్యం: భారీ స్థాయి వినియోగార్హ సామర్థ్యం.
5.    వినియోగదారు అనుభవం: వినియోగదారు ఇంటర్‌ఫేస్ వాడుకలో సౌలభ్యం- ప్రభావం.
6.    నైతిక మార్గదర్శకాలకు కట్టుబాటు: నైతిక సూత్రాలు-ప్రమాణాలతో పరిష్కారానికి ఆమోదయోగ్యత
7.    ప్రదర్శన-కమ్యూనికేషన్: ప్రాజెక్ట్ ప్రదర్శన-స్పష్టత- ఆమోద యోగ్య సామర్థ్యం.
8.     భావన రుజువు (పిఒసి): పరిష్కార కార్యాచరణ-ప్రభావాల ప్రదర్శన.
బహుమతులు

అగ్రస్థానంలో నిలిచిన ఐదుగురు విజేతలను ఎంపిక చేసి, ‘వేవ్స్‌’ కార్యక్రమంలో నగదు బహుమతులతో సత్కరిస్తారు.
1.    రూ.5 లక్షలు
2.    రూ.2.5 లక్షలు
3.    రూ.1.5 లక్షలు
4.    రూ.50 వేలు
5.    రూ. 50 వేలు

ముగింపు

ఆవిష్కర్తలు తమ సృజనాత్మకతను రుజువు చేసుకునే అమూల్య వేదికను ‘ట్రూత్‌టెల్ హ్యాకథాన్’ సమకూరుస్తుంది. అవాస్తవ సమాచార నిరోధంతోపాటు, నైతిక పాత్రికేయాన్ని ప్రోత్సహించే ‘ఎఐ’ ఆధారిత పరిష్కారాల రూపకల్పనకు చేయూతనిస్తుంది. ఈ వేదికపై శక్తిమంతమైన సాధనాలు, నిపుణుల మార్గదర్శకత్వం లభించడమే కాకుండా ‘వేవ్స్‌’ సమ్మిట్‌లో తమ ప్రభావశీల పరిష్కారాలను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. తద్వారా మీడియా రంగంలో వాస్తవిక మార్పు తెచ్చే దిశగా ఈ కార్యక్రమం ఒక ఉత్తేజపూర్వక ఉపకరణంగా మారుతుంది.
...

References

Click here to see PDF.

About WAVES

 

***


(Release ID: 2109351) Visitor Counter : 11