కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్ బంజారాహిల్స్ లో రేపు (మార్చి 6) తెలంగాణ జోనల్ కార్యాలయం, ప్రాంతీయ కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించనున్న కేంద్ర మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ


గుజరాత్ లోని నరోడా ప్రాంతీయ కార్యాలయాన్ని వర్చువల్ గా ప్రారంభించనున్న కేంద్ర మంత్రి, హర్యానాలోని గురుగ్రామ్ లో వసతి సముదాయానికీ శంకుస్థాపన

Posted On: 05 MAR 2025 2:14PM by PIB Hyderabad

హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ జోనల్ కార్యాలయంప్రాంతీయ కార్యాలయాల సముదాయాన్ని కేంద్ర కార్మికఉపాధియువజన వ్యవహారాలుక్రీడల శాఖా మంత్రి డాక్టర్ మాన్సుఖ్ మాండవీయ గురువారం ప్రారంభించనున్నారుదీనితోపాటు గుజరాత్ లోని నరోడా ప్రాంతీయ కార్యాలయాన్నీ ఆయన వర్చువల్ గా ప్రారంభిస్తారుహర్యానాలోని గురుగ్రామ్ లో సిబ్బంది వసతి సముదాయానికి శంకుస్థాపన చేస్తారుకేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జికిషన్ రెడ్డిమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులురాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుఇతర విశిష్ట అతిథులు కూడా కార్యక్రమానికి హాజరవుతారు.

మౌలిక సదుపాయాలునిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచి దేశవ్యాప్తంగా కార్మికులుభాగస్వాములందరికీ మెరుగైన సేవలందించే దిశగా ఈ చర్యలు కీలకమైన ముందడుగుగా నిలుస్తాయికార్మిక సంక్షేమంనిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడంపై మంత్రిత్వ శాఖ నిబద్ధతకు ఇది నిదర్శనం.

కార్యక్రమ వివరాలిలా ఉన్నాయి:

1. బంజారా హిల్స్ లో తెలంగాణ జోనల్ కార్యాలయంప్రాంతీయ కార్యాలయ సముదాయం ప్రారంభం (నేరుగా హాజరవుతారు):

బంజారాహిల్స్ లోని అత్యాధునిక కార్యాలయ సముదాయంలో తెలంగాణ జోనల్ కార్యాలయంప్రాంతీయ కార్యాలయం ఉంటాయి. ఈ ప్రాంతంలో మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను బలోపేతం చేసే దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగుకార్మిక సంబంధిత కార్యక్రమాల్లో సమన్వయాన్నిసేవా సమర్థతను ఈ కార్యాలయం మెరుగుపరుస్తుంది. దీని ద్వారా తెలంగాణలోని ఉద్యోగులు, యాజమాన్యాలుఇతర భాగస్వాములకు సేవల లభ్యత మరింతగా చేరువవుతుంది.

2. గుజరాత్ లోని నరోడా ప్రాంతీయ కార్యాలయ ప్రారంభం (వర్చువల్)

గుజరాత్ లో మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను విస్తృతపరుస్తూ నరోడాలో నిర్మించిన ప్రాంతీయ కార్యాలయాన్ని కేంద్ర మంత్రి వర్చువల్ గా ప్రారంభిస్తారుఈ ప్రాంతంలో కార్మిక వ్యవహారాల నిర్వహణను క్రమబద్ధీకరించడంకార్మిక చట్టాలకు అనుగుణంగా వారికి తోడ్పాటు అందించడంతోపాటు కార్మికులుపరిశ్రమలకు స్థానిక అవసరాలకు అనుగుణంగా సహకారాన్ని ఈ కార్యాలయం అందిస్తుంది.

3. గురుగ్రామ్ లో సిబ్బంది వసతి సముదాయానికి శంకుస్థాపన (వర్చువల్)

హర్యానాలోని గురుగ్రామ్ లో సిబ్బంది వసతి సముదాయానికి వర్చువల్ విధానంలో కేంద్ర మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. సిబ్బందికి ఆధునిక నివాస సౌకర్యాలను అందించేలా రూపొందించిన ప్రాజెక్టులో ఇది మొదటి అడుగుసిబ్బంది సంక్షేమంపని పరిస్థితులను మెరుగుపరచడంలో మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రతిబింబిస్తుందికార్మికులకు అండగా ఉన్నామన్న భరోసా కల్పించడం ద్వారా వారు సమర్థవంతంగా విధులను నిర్వహించేలా ప్రోత్సహిస్తుంది.  

 

***


(Release ID: 2108474) Visitor Counter : 16