వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ సీఈవోగా శ్రీ అజయ్ భాదూ నియామకం

Posted On: 05 MAR 2025 1:07PM by PIB Hyderabad

ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్ (జెమ్చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి (సీఈవో)గా వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ భాదూను కేంద్ర ప్రభుత్వం నియమించిందిఇది మార్చి నుంచి అమల్లోకి వస్తుందని తెలిపిందివాణిజ్య విభాగంలో ఇప్పటికే నిర్వర్తిస్తున్న బాధ్యతలకు అదనంగా ఈ బాధ్యతలను స్వీకరిస్తారు.

ప్రభుత్వ సేకరణ నిమిత్తం రూపొందించిన అతి పెద్ద ఈ-మార్కెట్ వేదిక అయిన జెమ్... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్నేతృత్వంలో తర్వాతి తరం డిజిటల్ మార్కెట్ ప్లేస్‌గా రూపాంతరం చెందుతున్న కీలక సమయంలో సీఈఓగా శ్రీ భాదూ నియామకం జరిగిందిప్రస్తుతం రూ. 4.58 లక్షల కోట్ల స్థూల విక్రయాల విలువ (జీఎంవీ)ను ప్రస్తుతం నమోదు చేసిందిఇది ఏడాదిలో 28.65 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది.

అఖిల భారత సర్వీసు (ఐఏఎస్)1999 వ బ్యాచ్‌ గుజరాత్ కేడర్‌ అధికారి అయిన శ్రీ భాదూ పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా విభిన్న రంగాల్లో విధానాల రూపకల్పనఅమలులో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని గడించారు.

వాణిజ్య విభాగ అదనపు కార్యదర్శిగా ఆగస్టు 2024లో శ్రీ భాదూ నియమితులయ్యారుగతంలో భారత ఎన్నికల సంఘంలో డిప్యుటీ ఎలక్షన్ కమిషనర్‌‌గా పని చేశారుమాజీ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్‌‌కు సంయుక్త కార్యదర్శిగాగుజరాత్ మారీటైమ్ బోర్డు సీఈవోగారాజ్ కోట్వడోదర మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్‌గా సైతం బాధ్యతలు నిర్వర్తించారుశ్రీ భాదూ సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీబెంగళూరులోని ప్రఖ్యాత నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా విశ్వవిద్యాలయం నుంచి వాణిజ్య న్యాయశాస్త్రంలో మాస్టర్స్ చేశారు.

 

***


(Release ID: 2108409)
Read this release in: English , Urdu , Hindi , Tamil