సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్: విహంగ వీక్షణ పోటీ
Posted On:
04 MAR 2025 5:09PM by PIB Hyderabad
గగనం నుంచి భారత సంగ్రహావలోకనం
పరిచయం:
‘క్రియేట్ ఇన్ ఇండియా’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న పోటీల్లో భాగంగా ప్రభుత్వం ‘ది వేవ్స్ (WAVES) ఇండియా: ఎ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్’ (భారత్: విహంగ వీక్షణ పోటీ) నిర్వహించనుంది. దీనికింద గగనతలం నుంచి సినిమాటోగ్రఫీ ద్వారా భరత భూమి అద్భుత సౌందర్యం, వైవిధ్యాల సంగ్రహ చిత్రణకు డ్రోన్ పైలట్లు, చిత్రనిర్మాతలను ఆహ్వానిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేవారు దేశంలోని సుందర ప్రకృతి దృశ్యాలు, వారసత్వం, ఉత్తేజపూరిత జనజీవన శైలిని కళ్లకు కట్టే 2–3 నిమిషాల లఘు చిత్రం రూపొందించాల్సి ఉంటుంది. కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ సహకారంతో ‘బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బిఇసిఐఎల్) ఈ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు ఆసక్తి ప్రదర్శిస్తూ 2025 ఫిబ్రవరి 15 నాటికి 956 దరఖాస్తులు అందాయి.

ముంబయిలోని ‘జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్-జియో వరల్డ్ గార్డెన్స్’లో 2025 మే 1 నుండి 4 వరకు నిర్వహించే ‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్) సన్నాహకాల్లో భాగంగా ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఈ తొలి భాగంలో మీడియా, వినోద రంగం మొత్తం ఏకీకృతమయ్యే ఒక ప్రత్యేక ‘కూడలి-విభాగాల’ వేదికగా ‘వేవ్స్’ ఉపయోగపడుతుంది. అంతర్జాతీయ మీడియా-వినోద పరిశ్రమ దృష్టిని భారత్ వైపు మళ్లించడం, భారతీయ మీడియా-వినోద రంగం విస్తృత ప్రతిభాపాటవాలతో దాన్ని అనుసంధానించడమే ఈ కీలక ప్రపంచ స్థాయి కార్యక్రమ లక్ష్యం. “బ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్మెంట్, ఎవిజిసి-ఎక్స్‌ఆర్(యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ), డిజిటల్ మీడియా-ఇన్నోవేషన్, ఫిల్మ్స్ (చలనచిత్రాలు)” నాలుగు కీలక స్తంభాలుగా ‘వేవ్స్’కు రూపకల్పన చేశారు. కాగా, తొలి కీలక స్తంభమైన బ్రాడ్‌కాస్టింగ్-ఇన్ఫోటైన్‌మెంట్‌లో భాగంగా ‘ఇండియా: ఎ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్’ నిర్వహణకు నిర్ణయించారు. ఇది మీడియా, సమాచార వ్యాప్తి, వినోద రంగం పరిణామశీల నేపథ్యంపై ఇది ప్రధానంగా దృష్టి సారిస్తుంది.
‘వేవ్స్’లో భాగమైన ‘క్రియేట్ ఇన్ ఇండియా’ పోటీలకు ఇప్పటిదాకా 73,000కుపైగా దరఖాస్తులు అందిన నేపథ్యంలో మీడియా-వినోద రంగంలో సృజనాత్మకత ఇనుమడించడానికి ఇది దోహదం చేస్తుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగాగల ప్రతిభావంతులైన సృష్టికర్తలకు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించే వేదికను సమకూరుస్తుంది. అంతేకాకుండా మీడియా-వినోద పరిశ్రమ కూడలిగా భారత్ పాత్రను మరింత బలోపేతం చేస్తుంది.
పోటీ విభాగాలు




సార్వత్రిక కేటగిరీ
· వీడియో ఎడిటర్లు
· వృత్తి నైపుణ్యంగల డ్రోన్ పైలట్లు
· చలనచిత్ర నిర్మాతలు/బృందాలు/విద్యార్థులు/వ్యక్తులు
డ్రోన్ దీదీ
· కేంద్ర ప్రభుత్వ పథకం ‘డ్రోన్ దీదీ’ కింద లబ్ధిదారులు
సూచిత ఇతివృత్తాలు
· భారత సుసంపన్న వారసత్వ చిత్రణ
· దేశవ్యాప్త వైవిధ్యభరిత జనజీవన శైలి చిత్రణ
· భారతదేశంలో వైవిధ్యం చిత్రీకరణ
· భారత విశిష్టత ప్రస్ఫుటీకరణ
· వివిధ రంగాల్లో భారత్ ప్రగతిని కళ్లకుకట్టే చిత్రణ
· భారత ప్రాచీన నాగరితక వైశిష్ట్యాన్ని ప్రతిబింబించడం
· అత్యాధునిక, ప్రగతిశీల భారతదేశాన్ని ఆవిష్కరించడం
· జనజీవనాన్ని ప్రభావితం చేసిన కీలక ఆవిష్కరణాత్మక కార్యక్రమాల చిత్రణ
· ‘డ్రోన్ దీదీ’ పథకం కింద డ్రోన్ల వినియోగం లేదా ఏదైనా సామాజిక సంబంధిత కార్యక్రమం చిత్రణ
మూల్యాంకన విధానం
వడపోత
సారాంశం, నాణ్యతల ప్రాతిపదికన ప్రతి కేటగిరీ (సార్వత్రిక, డ్రోన్ దీదీ) నుంచి 10 వీడియోల వంతున వడపోత ద్వారా తుది మూల్యాంకనానికి ఎంపిక చేస్తారు.
తుది ఎంపిక
ప్రసిద్ధ సంస్థలు, పరిశ్రమలోని నిపుణులతో ఏర్పాటు చేసిన విశిష్ట బృందం తుది మూల్యాంకనం నిర్వహిస్తుంది.
విజేతలు
ముంబయిలో నిర్వహించే ‘వేవ్స్-2025’ సమ్మిట్‌లో విజేతలను సత్కరిస్తారు
సమర్పణకు మార్గదర్శకాలు
. ప్రస్తుతం ‘నమో డ్రోన్ దీదీ’ విభాగంలో పాల్గొనేవారు మాత్రమే ఈ పోటీకి అర్హులు. వీరు 2025 మార్చి 15 లోగా వీడియోల సమర్పించాల్సి ఉంటుంది.
· అత్యాధునిక డ్రోన్ సాంకేతికతతో నిపుణ చిత్రీకరణ ద్వారా అద్భుత, హై-డెఫినిషన్ దృశ్యాలతో వీడియో రూపొందించాలి.
· అలాగే సినిమా తరహా మెరుగైన అనుభవం లక్ష్యంగా ఆకర్షణీయ గళంతో నేపథ్య కథనం వినిపించాలి. సంగీతం వృత్తి నైపుణ్యంతో కూర్చినదై ఉండాలి.
· వీడియో అసలైనదిగా... ఈ పోటీ కోసమే ప్రత్యేకంగా చిత్రించినదై ఉండాలి.
· మన దేశంలోని ఆహ్లాద, సౌందర్యభరిత దృశ్య వైవిధ్యం కనిపించాలి లేదా పోటీకి నిర్దేశించిన ఇతివృత్తాలకు అనుగుణమైనదిగా ఉండాలి.
· వీడియోలు మరే ఇతర మూలాల నుంచి కాపీతో సరిదిద్దిన లేదా పునఃరూపకల్పన చేసినవి ఉండరాదు.
· వీడియో “ఎంపి4/ఎంపిఇజి-4 లేదా ఎంఒవి” ఫార్మాట్లలో ఉండాలి.
· రూపొందించిన వీడియోకు సంబంధించిన ‘కాపీ రైట్’ పోటీ సమయంలో సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ/వేవ్స్ (WAVES) అధీనంలో ఉంటుంది.
బహుతులు - గుర్తింపు
అత్యున్నత పురస్కారం
· ప్రతి కేటగిరీ (సార్వత్రిక, డ్రోన్ దీదీ)లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహమతులుంటాయి.
ప్రోత్సాహక బహుమతి
· రెండు ప్రోత్సాహక బహుమతులుంటాయి.
ప్రశంసపత్రాలు
· ప్రతి కేటగిరీలో వడపోత తర్వాత ఎంపికైన వీడియోలకు డిజిటల్ ప్రశంస పత్రాల ప్రదానం ఉంటుంది.
· విశిష్ట సత్కారం
· ముంబయిలో నిర్వహించే వేవ్స్-2025 సమ్మిట్ సందర్భంగా బహుమతి విజేతలకు ఉత్తేజకర పురస్కారాలు, ప్రశంస పత్రాలు లభిస్తాయి.

ఉపసంహారం
‘వేవ్స్ ఇండియా: ఎ బర్డ్స్ ఐ వ్యూ ఛాలెంజ్’ అనేది గగనతలం నుంచి సినిమాటోగ్రఫీ ద్వారా భరత భూమి అద్భుత సౌందర్యం, ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక వారసత్వం, వైవిధ్యాలతోపాటు ఆధునికత దిశగా దేశ పురోగమనంపై సంగ్రహ చిత్రణ దిశగా డ్రోన్ పైలట్లు, చిత్రనిర్మాతలకు ఒక విశిష్ట అవకాశమిస్తోంది. ‘వరల్డ్ ఆడియో విజువల్-ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’ (వేవ్స్)లో భాగంగా సృజనాత్మక ప్రతిభను ఈ పోటీ ప్రోత్సహిస్తుంది. దీంతోపాటు దేశంలో మీడియా-వినోదం రంగం విస్తరణ నేపథ్యాన్ని ప్రపంచానికి ప్రముఖంగా చాటిచెబుతుంది. పాల్గొనేవారి నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ఆవిష్కరణ-కళాత్మక నైపుణ్యాలకు ఈ పోటీ వేదికగా రూపొందింది. అసాధారణ ప్రతిభకు గుర్తింపు, బహుమతి ప్రదానం ద్వారా మీడియా, సాంకేతికత, సృజనాత్మకతకు ప్రపంచ కూడలిగా భారత్ స్థానాన్ని ఈ పోటీ మరింత బలోపేతం చేస్తుంది.
***
(Release ID: 2108325)
|