భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్న ఈసీఐ

Posted On: 24 FEB 2025 5:12PM by PIB Hyderabad

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారుల (చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్స్-సీఈఓస్)తో ఒక సమావేశాన్ని భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-ఈసీఐ) మార్చి 4, 5 తేదీల్లో నిర్వహించనుంది. ఈ సమావేశం న్యూ ఢిల్లీలోని ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఉంటుంది.

 

ఎన్నికల సంఘం ప్రధానాధికారి (చీఫ్ ఎలక్షన్ కమిషనర్.. సీఈసీ)గా శ్రీ జ్ఞానేశ్ కుమార్ పదవీబాధ్యతలు స్వీకరించిన తరువాత నిర్వహించనున్న ఈ సమావేశం ఈ తరహా తొలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పాలుపంచుకోవడానికి ఒక డీఈఓను, ఒక ఈఆర్ఓను నామినేట్ చేయాల్సిందిగా సీఈఓలకు ఆదేశాలిచ్చారు. చట్టబద్ధ అధికారులయిన సీఈఓలు, డీఈఓలతోపాటు ఈఆర్ఓలు రాష్ట్ర, జిల్లా, విధానసభ నియోజకవర్గ స్థాయిలలో ముఖ్య అధికారుల పాత్రను పోషిస్తారు.

 

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎన్నికల అధికారులు మేధోమధనం లో పాల్గొనడంతోపాటు వారు తమ తమ అనుభవాలను తెలియజేస్తే, ఆ అనుభవాల నుంచి ఇతర అధికారులు అనేక అంశాలను నేర్చుకోవడానికి ఈ రెండు రోజుల సమావేశం ఒక వేదికగా మారనుంది. మొదటి రోజు సమావేశంలో ఐటీ సదుపాయాలు, ప్రభావశీల పద్ధతిలో సందేశాలను పంపుకోవడం, సామాజిక మాధ్యమాలతో సంబంధాలను పెంపొందించుకోవడంతోపాటు ఎన్నికల ప్రక్రియలలో పాలుపంచుకొనే వివిధ నిర్వహణ అధికారులు పోషించాల్సిన చట్టబద్ధ భూమిక సహా ఆధునిక కాలంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలపైన చర్చించనున్నారు. రెండో రోజు, అంతకు ముందు రోజున ఇతివృత్తాల వారీగా చేపట్టిన చర్చల ఆధారంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఈఓలు తాము ఏయే కార్యాచరణ ప్రణాళికలను అమలుచేయదలుస్తున్నదీ వెల్లడిస్తారు.

 

*****


(Release ID: 2105944) Visitor Counter : 9