ప్రధాన మంత్రి కార్యాలయం
రైతుల ఖాతాలలోకి ఇంతవరకు సుమారు రూ.3.5 లక్షల కోట్లు చేరడం ఆనందాన్నిస్తోంది: ప్రధానమంత్రి
పీఎం కిసాన్ యోజన ప్రారంభించి ఆరేళ్లయిందన్న ప్రధాని
Posted On:
24 FEB 2025 9:53AM by PIB Hyderabad
భారత్‌లో రైతులకు అందడండలను అందిస్తూ వారి అభ్యున్నతికి అంకితం చేసిన ఒక ప్రధాన కార్యక్రమమైన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ ఆరో వార్షికోత్సవ సందర్బంగా దేశవ్యాప్తంగా రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రైతుల ఖాతాలలో ఇంత వరకు దాదాపు రూ.3.5 లక్షల కోట్లు జమ కావడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:
‘‘పీఎం-కిసాన్‌కు 6 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశమంతటా మన రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు అభినందనలు. వారి ఖాతాలలో ఇంతవరకు సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు జమ కావడం నాకు అత్యంత సంతోషాన్ని, గర్వాన్నీ కలిగించింది. మా ఈ ప్రయత్నం అన్నదాతలకు గౌరవాన్నీ, సమృద్ధినీ, కొత్త శక్తినీ ఇస్తోంది’’.
#PMKisan
(Release ID: 2105850)
Visitor Counter : 32
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam