గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పేరిట నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ (ఎన్ఆర్డీఆర్ఎం) నకిలీ నియామకాలు!

Posted On: 17 FEB 2025 4:32PM by PIB Hyderabad

ఒక సంస్థ జాతీయ గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌డీ) పేరుతో మోసపూరిత ప్రకటనలిస్తూ నియామకాల కార్యక్రమాన్ని చేపడుతోందని మంత్రిత్వ శాఖ సాధారణ ప్రజానీకం దృష్టికి తీసుకువచ్చింది.  డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రోడ్డు, న్యూ ఢిల్లీ, 110001లో కార్యాలయం ఉందని నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ (ఎన్ఆర్డీఆర్ఎం) చెప్పుకొంటోందని జాతీయ గ్రామీణాభివృద్ధి  శాఖ తెలిపింది. అలాగే,  www.nrdrm.com(http://www.nrdrm.com)తోపాటు www.nrdrmvacancy.com (http://www.nrdrmvacancy.com) అనే వెబ్‌సైట్లు కూడా, చెప్పుకొంటున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ పరిధిలో ఏమీ పనిచేయడం లేదని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది.

మంత్రిత్వ శాఖ, దాని అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రిక్రియేషన్ మిషన్ (ఎన్ఆర్డీఆర్ఎం) ఒడిగట్టిన దుష్కార్యాలు గాని, నియామక కార్యకలాపాలు గాని మోసపూరితంగా భావించాలని, వీటిలో ఎలాంటి ఔచిత్యం లేదని స్పష్టం చేశారు.

మంత్రిత్వ శాఖ తన నియామకాల ప్రక్రియలో ఏ దశలో కూడా ఎలాంటి రుసుంగాని, ఇతరత్రా గాని వసూలు చేయదు; దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాల సమాచారం తెలియజేయాల్సిందిగా కోరదు; ఈ విభాగంలో ఉద్యోగ భర్తీకి సంబంధించిన సమాచారాన్ని తన ఆధికారిక వెబ్‌సైట్ rural.gov.in లో పొందుపరుస్తుంటామని ఎంఓఆర్‌డీ స్పష్టం చేసింది.

 

***


(Release ID: 2104252)