ప్రధాన మంత్రి కార్యాలయం
పూజ్య సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రధానమంత్రి
Posted On:
15 FEB 2025 5:12PM by PIB Hyderabad
పూజ్య సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.
ప్రధానమంత్రి ఎక్స్ వేదికగా ఇలా పోస్ట్ చేశారు.
“పూజ్య శ్రీ సేవాలాల్ మహారాజ్ జీ జయంతి సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక నమస్కారాలు! ఆయన పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. తన శక్తి మేరకు, నిరంతరం సామాజిక న్యాయం కోసం పోరాడారు. మహారాజ్ జీ సదా సమానత్వం, సద్భావన, భక్తి, నిస్వార్థ సేవ అనే విలువలకు అంకితమయ్యారు. ఆయన సందేశాలు సమాజంలోని ప్రతి తరాన్ని సున్నితమైన, కరుణామయ జీవితాన్ని గడిపేందుకు ప్రేరేపించాయి. మానవాళి సేవ కోసం న్యాయమైన, సామరస్య పూర్వకమైన సమాజాన్ని రూపొందించేందుకు ఆయన చేసిన మంచి ఆలోచనలు సదా మనకు మార్గనిర్దేశం చేస్తుంటాయి.
జై సేవాలాల్!”
***
MJPS/ST
(Release ID: 2103897)
Visitor Counter : 22
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam