సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రభుత్వ పాలనలో అత్యుత్తమ సేవకు అందించే ‘ప్రధానమంత్రి పురస్కారాలు-2024’ సమాచారం


పొడిగించిన తుది గడువు - ఫిబ్రవరి 21 వరకూ నామినేషన్ల స్వీకరణ

Posted On: 14 FEB 2025 6:24PM by PIB Hyderabad

Release ID: 2103315 final-bsr 

 

 

 సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ

ప్రభుత్వ పాలనలో అత్యుత్తమ సేవకు అందించే ‘ప్రధానమంత్రి పురస్కారాలు-2024’ సమాచారం  

పొడిగించిన తుది గడువు - ఫిబ్రవరి 21 వరకూ నామినేషన్ల స్వీకరణ

Posted On: 14 FEB 2025 6:24PM by PIB Delhi

ప్రభుత్వ పాలనలో  అత్యుత్తమ సేవకు అందించే ప్రధానమంత్రి పురస్కారాలు-2024కు సంబంధించి నామినేషన్ల నమోదు, స్వీకరణ ప్రక్రియ ఈ ఏడాది జనవరి 20న ప్రారంభమయ్యింది.  

క్రింది విభాగాలకు సంబంధించి నామినేషన్లను ఆహ్వానిస్తున్నారు: -

 -1-   11 ప్రాతినిధ్య రంగాల్లో చేపట్టే కార్యక్రమాల ద్వారా జిల్లాల సమగ్ర అభివృద్ధి. ఈ విభాగంలో 5 పురస్కారాలను అందిస్తారు.

          - 2 - ఆకాంక్షాత్మక బ్లాకుల పథకం. ఈ విభాగంలో  5 పురస్కారాలను అందిస్తారు.

          - 3 -  కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, జిల్లాల విభాగాల్లో వినూత్న కార్యక్రమాలు.  ఈ విభాగంలో 6 పురస్కారాలను అందిస్తారు.

దరఖాస్తుదారులు అప్లోడ్ చేయవలసిన అధిక  సమాచారం దృష్ట్యా, వివిధ సంస్థల నుంచీ అందిన అభ్యర్ధనల మేర, నామినేషన్ల నమోదు, దరఖాస్తు పత్రాల సమర్పణ ప్రక్రియ తుది గడువును 14.02.2025 నుంచీ 21.02.2025 (రాత్రి 11 గం. 59 ని. లోపు) కు పొడిగించారు. ప్రభుత్వ పాలనలో అత్యుత్తమ సేవకు అందించే ప్రధానమంత్రి పురస్కారాలు-2024 దరఖాస్తులను ఆన్లైన్ పద్ధతిలో సంబంధిత వెబ్సైట్     (www.pmawards.gov.in)    లో  సమర్పించాలి.


 

*****


(Release ID: 2103431) Visitor Counter : 34