సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్’ లో ‘ఎక్స్టెండెడ్ రియాలిటీ’ సృజనకారుల ప్రదర్శన


చంద్రయాన్, గేమింగ్ యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన

వర్చువల్ రియాలిటీ సెషన్లు సహా పలు ఆసక్తికర కార్యక్రమాల ఏర్పాటు

Posted On: 13 FEB 2025 6:26PM by PIB Hyderabad

ఫిబ్రవరి 8 వేవ్ ల్యాప్స్, ‘భారత్ ఎక్స్ ఆర్’ ల సంయుక్త ఆధ్వర్యంలో నోయిడాలోని 91, స్ప్రింగ్ బోర్డ్ వేదికగా ఏర్పాటైన XR Creator Hackathon's ఢిల్లీ సంచిక,  వేవ్స్ (WAVESసమిట్ కార్యక్రమాల్లో మైలురాయిగా నిలిచింది. 80కి పైగా ప్రతినిధులు అత్యాధునిక ‘ఎక్స్ ఆర్’ (ఎక్స్టెండెడ్ రియాలిటీసాంకేతికతతో కూడిన భిన్న కార్యక్రమాల్లో పాల్గొన్నారుWAVES ‘మేకిన్ ఇండియా’ పోటీలో భాగంగా ఏర్పాటైన ఈ కార్యక్రమానికి సమాచారప్రసార మంత్రిత్వశాఖ మద్దతునందిస్తోంది. ‘ఇమ్మర్సివ్ టెక్నాలజీ’ తాజా సాంకేతికతలో దేశాన్ని అగ్రగామిగా నిలపాలన్న ఢిల్లీ టెక్ బృందాల సంకల్పానికి ఈ కార్యక్రమం అద్దం పడుతోంది.

ఏఆర్’ (ఆగ్మెంటెడ్ రియాలిటీ), ‘వీఆర్’ (వర్చువల్ రియాలిటీ)లకు సంబంధించి అవగాహనను పెంచే అనేక కార్యక్రమాలను అందించిన ఛవీ గర్గ్అంకిత్ రాఘవ్సిద్ధార్థ్ సత్యార్థి తదితర పరిశ్రమ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారుఏఆర్వీఆర్ అప్లికేషన్ల తయారీ సహా ‘యూనిటీ’, ‘అన్ రియల్ ఇంజిన్’ వంటి అంశాల గురించి ప్రతినిధులకు తెలియజెప్పారుఅంతేకాక.. వివిధ పరిశ్రమ అవసరాలకు తగినట్లు నూతన సాంకేతికతల వినియోగం సహా అనేక ఆచరణాత్మక అంశాల పట్ల అవగాహనను కల్పించారు.

కార్యక్రమానికి WAVES నోడల్ అధికారిగా బాధ్యతలు నెరవేరుస్తున్న సమాచార ప్రసారశాఖ సంయుక్త కార్యదర్శి ఆశుతోష్ మొహలే హాజరయ్యారునూతన సాంకేతికతల్లో ఆవిష్కరణలకు ప్రభుత్వం అందిస్తున్న మద్దతుఆర్థిక పరిపుష్టి దిశగా కొత్త రంగం తీసుకుంటున్న చర్యలను సంయుక్త కార్యదర్శి రాక స్పష్టం చేసింది.

ఎక్స్ఆర్ హ్యాకథాన్ ప్రతినిధులు తయారు చేసిన కీలక ప్రాజెక్టులను వీఆర్ యాక్టివిటీ సెషన్ లో ప్రదర్శించారుచంద్రయాన్ యాత్రగేమింగ్ యుద్ధ సన్నివేశాల కల్పన వంటి వర్చువల్ కార్యక్రమాలువీఆర్ పర్యాటక అప్లికేషన్ వంటివి దేశ ఎక్స్ ఆర్ బృందాల సామర్థ్యానికిసృజనకూ తార్కాణంగా నిలిచాయి.  

అరెక్సా’ వ్యవస్థాపకురాలుఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ సహ ఏర్పాటుదారు ‘భారత్ ఎక్స్ ఆర్’ కు చెందిన ఛవీ గర్గ్పెరుగుతున్న ఎక్స్ ఆర్ సాంకేతికత ప్రాముఖ్యాన్ని గురించి చెబుతూ.. “ఎక్స్ ఆర్ సాంకేతికత శరవేగంగా అభివృద్ధి చెందుతోందివెబ్యాప్ లుఎఐ/ఎంఎల్ వంటి వాటితో అనుసంధానిస్తే మరింత ప్రభావవంతంగా పని చేయగలదు..” అని అన్నారు.

ప్రభుత్వంపరిశ్రమల వారూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలు ఎక్స్ ఆర్ పరిశ్రమలో పని చేస్తున్న విద్యార్థులూ నిపుణులకు దేశంలోనే ఆవిష్కరణలు చేసే అవకాశాలను కల్పిస్తూప్రపంచానికి మన సత్తా చాటే సందర్భాన్ని కల్పిస్తున్నాయి” అని Wavelaps సీఈఓ ఆశుతోష్ కుమార్ అన్నారుWavelaps సంస్థWAVES కు పరిశ్రమ భాగస్వామిగాఎక్స్ ఆర్ క్రియేటర్ హ్యాకథాన్ సహ ఏర్పాటుదారుగా వ్యవహరిస్తోంది.   

మీడియా ఆసక్తిని విశేషంగా ఆకర్షించిన ఈ కార్యక్రమానికి దూరదర్శన్ న్యూస్ఆకాశవాణి సహా అనేక మీడియా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారుప్రతినిధులకు అనేక క్రియాశీలక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పించడంతో  కార్యక్రమాలు మరింత ఆసక్తికరంగా మారాయి.

XR Creator Hackathonలో భాగమైన ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో Wavelaps తో పాటు ‘భారత్ ఎక్స్ ఆర్’, ‘ఎక్స్ డీ జీ’ లు సహకారం అందించాయి. 250 నగరాల నుంచీ అందిన 2,200 రిజిస్ట్రేషన్లతో ఏర్పాటైన  ఈ జాతీయ హ్యాకథాన్,  వీఆర్ఏఆర్ హ్యాకథాన్ లలో అతి పెద్ద కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.  మూడో దశకు (ఫేజ్3) కు చేరుకున్న ఈ పోటీలో టాప్ ఫైవ్ లో స్థానాన్ని దక్కించుకునేందుకువివిధ ఇతివృత్తాలుసృజనాత్మక ఉత్పత్తులతో సిద్ధమైన 40 బృందాలు  పోటీ పడుతున్నాయి.  

వేవ్స్ సమిట్ నేపథ్యం:

సృజనాత్మక సాంకేతికతలో భారత్ సాధించిన ప్రగతిని చాటే Wave Summitఆవిష్కర్తలుపరిశ్రమల నేతలుప్రభుత్వ సంస్థల మధ్య సహకారం పెంపు కోసం కృషి చేస్తూఇమ్మర్సివ్ టెక్నాలజీ రంగంలో సృజన అభివృద్ధికి దోహదపడుతోంది.

ఎక్స్ ఆర్ హ్యాకథాన్ నేపథ్యం:

XR Creator Hackathon ఎక్స్టెండెడ్ రియాలిటీ సాంకేతికతల్లో సృజన పెంపుకు నిర్దేశించిన జాతీయస్థాయి కార్యక్రమంకేంద్ర సమాచారప్రసారశాఖ సహకారంవేవ్ ల్యాప్స్ఎక్స్ డీజీభారత్ ఎక్స్ ఆర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంఇమ్మర్సివ్ సాంకేతికతల్లో భారత్ స్థానాన్ని పటిష్ఠం చేసే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా గల సృజన కారులను ఒక చోటకు చేరుస్తోంది.   

 

***


(Release ID: 2103238) Visitor Counter : 25