సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంటులో ప్రశ్న: ప్రభుత్వ రంగం, ప్రభుత్వ రంగ సంస్థల్లో నూతన ఉద్యోగావకాశాలు

Posted On: 13 FEB 2025 3:51PM by PIB Hyderabad

ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగ సామర్థ్యాన్ని మెరుగుపరిచడమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యతదీని ప్రకారం దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు భారత ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐపథకంప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ), మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్), పండిట్ దీన దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (డీడీయూ జీకేవై), దీనదయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం (డీఏవై ఎన్ఆర్ఎల్‌ఎం), దీన్‌దయాల్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధి కార్యక్రమం (డీఏవై ఎన్‌యూఎల్ఎం), మేక్ ఇన్ ఇండియాస్టార్టప్ ఇండియాస్టాండప్ ఇండియాడిజిటల్ ఇండియాపీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర నిధి (పీఎం-స్వనిధిపథకంప్రధానమంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై), తదితర పథకాల్లో ఉపాధి కల్పనకు గణనీయమైన పెట్టుబడులు పెడుతోందిరోడ్లురైల్వేలువిమానాశ్రయాలునౌకాశ్రయాలుజలమార్గాలు తదితరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన రంగాల్లో ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది.

ప్రభుత్వప్రైవేటు రంగాల్లో కెరీర్‌కు సంబంధించిన సేవలను నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అందిస్తోందిwww.ncs.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్లైన్ఆఫ్‌లైన్ జాబ్ ఫెయిర్లకు సంబంధించిన సమాచారంఉద్యోగ శోధనఅభిరుచికి అనుగుణంగా కెరీర్ కౌన్సిలింగ్వృత్తిపరంగా మార్గనిర్దేశంనైపుణ్యాభివృద్ధి కోర్సుల గురించి సమాచారంనైపుణ్యం/శిక్షణా కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చుఐదేళ్ల కాల వ్యవధికి రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 4.1 కోట్ల యువతకు ఉపాధినైపుణ్య శిక్షణఇతర అవకాశాల కోసం ఐదు పథకాలుకార్యక్రమాలను 2024-2025 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారుపర్యాటకంతయారీమత్స్య తదితర రంగాల్లో బహుళ ఉపాధి అవకాశాలను సృష్టించడం కూడా ఈ కేంద్ర బడ్జెట్ లక్ష్యంఅలాగే యువతలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించడానికినైపుణ్యాలను పెంపొందించడానికి చేపట్టాల్సిన వివిధ చర్యలు సైతం దీనిలో ఉన్నాయి.

వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడం నిరంతరంగా కొనసాగే ప్రక్రియభారత ప్రభుత్వం నిర్వహిస్తున్న రోజ్‌గార్ మేళా ద్వారా త్వరితగతిన ఖాళీలను భర్తీ చేస్తున్నారుఇది కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/విభాగాలుకేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ (సీపీయూ)లుస్వయంప్రతిపత్తి సంస్థలువిద్యఆరోగ్యసంస్థలు తదితరమైన వాటిలో నిర్ణీత కాలపరిమితిలో మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందిఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాల్లోని 45-50 నగరాల్లో కేంద్ర స్థాయిలో 14 రోజ్‌గార్ మేళాలు జరిగాయిఈ రోజ్ గార్ మేళాల్లో పాల్గొన్న లక్షల మందికి మంత్రిత్వ శాఖలు/విభాగాలు నియామక పత్రాలు అందజేశాయి.

సిబ్బందిప్రజా ఫిర్యాదులుపించన్లు శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.

 

****


(Release ID: 2102825) Visitor Counter : 37