సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
మహాకుంభ్ 2025: ప్రయాగరాజ్ త్రివేణీ సంగమం వద్ద ఇప్పటి వరకూ 40 కోట్లకు పైగా భక్తుల పవిత్ర స్నానాలు
Posted On:
07 FEB 2025 4:20PM by PIB Hyderabad
మహాకుంభ్ 2025 లో భాగంగా, ఈ రోజు ఉదయం10 గంటల సమయానికి ప్రయాగరాజ్ వద్ద పవిత్ర స్నానం ఆచరించిన భక్తుల సంఖ్య 42 కోట్లను దాటింది. కుంభమేళా ముగిసేనదుకు మరో 19 రోజులు మిగిలి ఉండటంతో ఈ సంఖ్య 50 కోట్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు.
విభిన్న సంస్కృతుల సమాహారం - మహాకుంభ్
మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి పర్వదినాల సందర్భంగా చేసిన మూడు అమృత స్నానాల తరువాత కూడా భక్తుల్లో పవిత్ర నదీ స్నానం పట్ల ఆసక్తి ఎంత మాత్రం తగ్గుముఖం పట్టలేదు. దేశం, ప్రపంచం నలుమూలాల నుంచీ ప్రయాగరాజ్ కు చేరుకుంటున్న భక్తులు త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు తరలివస్తున్నారు. వీరిలో 1 కోటి మందికి పైగా కల్పవాసీలు, భక్తులు, సాధువులు కూడా ఉన్నారు.
భక్తజన సందోహం
మౌని అమావాస్య నాడు అత్యధిక సంఖ్యలో 8 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానం ఆచరించగా, మకర సంక్రాంతి నాడు 3.5 కోట్ల మంది త్రివేణీ సంగమం వద్ద మునక వేశారు. ఇక జనవరి 30, ఫిబ్రవరి 1న 2 కోట్ల మంది, పౌష్య పౌర్ణమి నాడు 1.7 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేశారు. వసంత పంచమి పర్వదినం నాడు 2.5 కోట్ల మంది త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలను ఆచరించారు.
ఇప్పటివరకూ పవిత్రస్నానం ఆచరించిన ప్రముఖులు
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (తన మంత్రివర్గ సహచరులతో సహా), ఇతర ప్రముఖ నేతలూ ఇప్పటి వరకూ సంగమంలో పవిత్ర స్నానం చేసిన వారిలో ఉన్నారు. ఫిబ్రవరి 10 వ తేదీన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము త్రివేణీ సంగమం వద్ద పుణ్య స్నానం ఆచారిస్తారని భావిస్తున్నారు.
పవిత్ర స్నానమాచరించిన ఇతర ప్రముఖులు: ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రాజస్థాన్ గవర్నర్ శ్రీ భజన్ లాల్ శర్మ, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ, మణిపూర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్ బీరేన్ సింగ్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్. ఇక కేంద్ర మంత్రులు శ్రీ గజేంద్ర సింగ్ షఖావత్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, శ్రీ శ్రీపాద నాయక్ కుంభమేళాలో పవిత్ర స్నానాలను పూర్తి చేసుకున్నారు. పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సుధాంశు త్రివేది, శ్రీమతి సుధా మూర్తి, శ్రీ రవి కిషన్ లు కూడా పుణ్య స్నానాలు చేశారు.
సీనియర్ బీజేపీ నేతలు శ్రీ రవిశంకర్ ప్రసాద్, సమాజవాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ అఖిలేష్ యాదవ్, ఒలింపిక్ పతక విజేత సైనా నెహ్వాల్, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్, క్రికెటర్ సురేష్ రైనా, అంతర్జాతీయ కుస్తీ యోధుడు ఖాలీ, నృత్య దర్శకుడు రెమో డిసూజా తదితరులు ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభ్ లో ప్రవిత్ర స్నానాలు ఆచరించారు.
***
(Release ID: 2100879)
Visitor Counter : 41