కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలికాం సంబంధిత మోసాలను అరికట్టేందుకు తీసుకున్న చర్యలు

Posted On: 06 FEB 2025 3:12PM by PIB Hyderabad

టెలికాం వనరులను ఉపయోగించుకొంటూ సైబర్‌ నేరాలుఆర్థిక నేరాలకు పాల్పడడాన్ని నివారించడానికీపౌరుల ప్రయోజనాలను కాపాడడానికీ ఈ కింద ప్రస్తావించిన చర్యల్ని టెలికమ్యూనికేషన్ల విభాగం (డీఓటీచేపట్టింది:

i. నకిలీ దస్తావేజులతోకల్పిత దస్తావేజులతో దక్కించుకొన్న అనుమానాస్పద మొబైల్ కనెక్షన్లను గుర్తించడానికి ఒక వ్యవస్థను రూపొందించడంతోపాటు పునఃపరిశీలన చేయాల్సిందిగా టెలికాం సేవల ప్రదాత సంస్థల (టీఎస్‌పీస్)కు ఆదేశాలిచ్చారు.

ii. మొబైల్ వినియోగదారులకు సాధికారతను కల్పించడంతోపాటువారికి భద్రతను కల్పించడానికీ, అవగాహనను పెంపొందించడానికి పౌర సేవా ప్రధాన కార్యక్రమం ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi)ని తీసుకువచ్చారు దీనిని https://sancharsaathi.gov.in వెబ్ పోర్టల్ రూపంలోనూమొబైల్ యాప్ రూపంలోనూ అందుబాటులో ఉంచారుసంచార్ సాథీ ఇతర విషయాలతో పాటు ఈ కింది సౌకర్యాలను పౌరులకు అందిస్తుంది:

మోసం అనే అనుమానం వచ్చిన, ఇబ్బంది పెట్టే వాణిజ్య ప్రధానమైన కాల్స్‌ను గురించి ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది.

బిమీ పేరుతో జారీ అయిన మొబైల్ కనెక్షన్ల విషయంలో సమాచారాన్ని తెలుసుకోండిఅక్కర్లేని మొబైల్ కనెక్షన్లను గురించిలేదా వారికి చెందని మొబైల్ కనెక్షన్లను గురించి కూడా తెలుసుకోవచ్చు.

సిదొంగతనానికి గురైనపోగొట్టుకున్న మొబైల్ హ్యాండ్‌సెట్లను బ్లాక్ చేయడం కోసం గాని లేదా జాడ కనుక్కోవడం గురించి ఇందులో సౌకర్యం ఉంది.

డి.  మొబైల్ హ్యాండ్‌సెట్ ఎంతవరకు నికార్సయిందీ తెలుసుకోండి.

iii.    సైబర్-నేరాలనుఆర్థిక మోసాలను అడ్డుకోవడానికి టెలికాం వనరుల దుర్వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని ఆసక్తిదారులతో పంచుకోవడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారాన్ని (డీఐపీతీసుకువచ్చారుప్రస్తుతంబ్యాంకులుఆర్థిక సంస్థలుభారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ), రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల పోలీసు విభాగాలుభద్రత సంస్థలుభారతీయ సైబర్‌ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (4సీ), టీఎస్‌పీలు వంటివి సమారు 540 సంస్థలు ఈ ప్లాట్‌ఫారంలో చేరిపోయాయి

iv. భారత్‌ నుంచే వచ్చినట్లు కనిపించే భారతీయ మొబైల్ నంబర్లను చూపుతూ వచ్చే అంతర్జాతీయ నకిలీ కాల్స్‌ను గుర్తించడానికీవాటిని ఆపడానికీ ఒక వ్యవస్థను డీఓటీటెలికాం సేవల ప్రదాత సంస్థ (టీఎస్‌పీ)లు రూపొందించాయిఇటీవల కొంతకాలంగా నకిలీ డిజిటల్ అరెస్టులుఫెడెక్స్ కుంభకోణాలుకొరియర్‌లో డ్రగ్స్మాదకద్రవ్యాలుతాము ప్రభుత్వ అధికారులమనిపోలీసు అధికారులమని బుకాయించడండీఓటీటెలికాం నియంత్రణ ప్రాధికరణ సంస్థ అధికారులు మొబైల్ నంబర్లను డిస్‌కనెక్ట్ చేయడం వగైరా వ్యవహారాల్లో సైబర్ నేరగాళ్లు ఈ తరహా అంతర్జాతీయ బూటకపు కాల్స్‌ చేస్తుంటారు 

దీనికి అదనంగాప్రజలు అన్ని రకాలైన సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి వీలుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా జాతీయ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in) ను ప్రారంభించింది.

టెలికమ్యూనికేషన్ సంబంధిత మౌలిక సదుపాయాల భద్రతను దృష్టిలో పెట్టుకొని టెలికమ్యూనికేషన్స్ చట్టం2023 సెక్షన్ 22లో భాగంగా టెలికాం సైబర్ సెక్యూరిటీ నిబంధనలతోపాటు కీలక టెలికమ్యూనికేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూల్స్‌ను 21.11.2024, 22.11.2024 తేదీల్లో డీఓటీ తెచ్చిందిభారతీయ టెలికాం నెట్‌వర్క్ కోసమని డీఓటీ మున్ముందు ఎదురుకాగల సైబర్ బెదరింపులను పసిగట్టడానికి ఒక టెలికాం సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ (టీఎస్ఓసీ)ని ఏర్పాటు చేసిందిటెలికమ్యూనికేషన్ల విభాగం పౌరులతో సమన్వయాన్ని నెలకొల్పుకుంటూటెలికాంకు సంబంధించిన మోసాలనూ, కుంభకోణాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారానూతరచుగా పత్రికా ప్రకటనలను జారీ చేస్తుండడం ద్వారానూ వారిలో అవగాహన కల్పిస్తోంది.

కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్ ఈ సమాచారాన్ని ఈ రోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

 

***


(Release ID: 2100508) Visitor Counter : 32