వ్యవసాయ మంత్రిత్వ శాఖ
కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఏర్పాటు
प्रविष्टि तिथि:
04 FEB 2025 1:34PM by PIB Hyderabad
ఐసీఏఆర్ ఆధ్వర్యంలోని కేంద్ర వరి పరిశోధనా సంస్థ (సీఆర్ఆర్ఐ) - హజరీబాగ్ (జార్ఖండ్), గెరువా (అస్సాం), నైరా (ఆంధ్రప్రదేశ్)లో మూడు ఉపకేంద్రాలున్నాయి. వీటి ద్వారా ఒడిశాలోని బార్ఘఢ్ సహా దేశవ్యాప్తంగా వరిసాగులో ఉత్పాదకతను, లాభాలను పెంచడంతో పాటు వివిధ రాష్ట్రాల్లోని విభిన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వరిసాగులో స్థిరత్వాన్ని మెరుగుపరిచే పర్యావరణహిత సాంకేతికతలను అభివృద్ది చేస్తాయి. వీటితో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో ఉన్న ఐసీఏఆర్ - భారతీయ వరి పరిశోధనా సంస్థ (ఐఐఏఆర్) కూడా దేశంలో వరి సాగుపై పరిశోధనలు చేస్తోంది.
వీటికి అదనంగా ఒడిశాలో వరి సాగు విస్తరణపై భువనేశ్వర్‌లోని ఒడిశా వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఓయూఏటీ) పరిశోధనలు చేస్తోంది. కాబట్టి ఒడిశాలోని బార్ఘడ్‌లో ప్రత్యేకంగా కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదు.
పైన పేర్కొన్న రెండు జాతీయ సంస్థలు వరి సాగులో వివిధ పర్యావరణ-స్మార్ట్ టెక్నాలజీ/ఉత్పత్తులను అభివృద్ధి చేసి వాటి పనితీరును పరీక్షిస్తాయి. ఈ వంగడాలు/సాంకేతికతల ఫలితాలను బార్ఘఢ్ రైతులు సైతం పొందుతున్నారు.
పైన పేర్కొన్న రెండు పరిశోధనా సంస్థల నేతృత్వంలో విస్తృతమైన, ప్రభావవంతమైన వ్యూహాల ద్వారా అధునాతన సాంకేతికతలను అభివృద్ధి చేసి దేశ వ్యాప్తంగా వరి దిగుబడిని పెంచాలనే జాతీయ లక్ష్యంతో ఐసీఏఆర్ పనిచేస్తోంది. మెరుగుపరిచిన వంగడాలు, సాంకేతికతలను అవలంబించడం ద్వారా ఒడిశాతో పాటు దేశవ్యాప్తంగా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, దిగుబడిని పెంచే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.
లోక్‌సభలో ఈ రోజు అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ భగీరథ్ చౌధరి ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
***
(रिलीज़ आईडी: 2099682)
आगंतुक पटल : 110