పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు
Posted On:
03 FEB 2025 5:09PM by PIB Hyderabad
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సీజీడీ) వ్యవస్థ అభివృద్ధిలో పైపుల ద్వారా సహజవాయువు (పీఎన్‌జీ) కనెక్షన్లను అందించడం ఒక భాగంగా ఉంది. పెట్రోలియం, సహజవాయు నియంత్రణా బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ) ఆమోదించిన సంస్థలు దీన్ని చేపడుతున్నాయి. సీజీడీ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు దేశంలోని 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 733 జిల్లాలను 100 శాతం కవర్ చేసేలా 307 భౌగోళిక ప్రాంతాలు (జీఏ)ను పీఎన్‌జీఆర్‌బీ అనుమతి ఇచ్చింది. మొత్తం జార్ఖండ్‌ను కవర్ చేసేలా సీజీడీ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి 11 భౌగోళిక ప్రాంతాలు (జీఏ)ను (బీహార్, జార్ఖండ్లో విస్తరించిన 3 జీఏలతో కలిపి) పీఎన్‌జీఆర్‌బీ అనుమతించింది.
దేశంలో సీజీడీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. వాటిలో కొన్ని
· గృహావసరాలకోసం ఉపయోగించే సహజవాయువును సీజీడీ రంగానికి కేటాయించడం.
· పీఎన్‌జీ ప్రయోజనాల కోసం అందుబాటులో ఉన్న విధానం ద్వారా (దశలవారీ సరఫరా విధానంతో సహా) గృహావసరాల కోసం గ్యాస్ సరఫరా చేయడం.
· సీజీడీ ప్రాజెక్టులకు ప్రజా వినియోగ హోదాను కల్పించడం.
· రక్షణ నివాస ప్రాంతాలు/యూనిట్ లైన్లలో పీఎన్‌జీ వినియోగం కోసం మార్గదర్శకాలు.
· ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు నివసించే గృహసముదాయాల్లోపీఎన్‌జీ వినియోగానికి మార్గదర్శకాలు.
· అన్ని ప్రభుత్వ నివాస సముదాయాల్లో పీఎన్‌జీ సరఫరాకు సీపీడబ్ల్యూడీ, ఎన్‌బీసీసీ మార్గదర్శకాలు.
వీటికి అదనంగా సీజీడీ వ్యవస్థ అభివృద్ధికి, ఈ విషయంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో తరచూ చర్చలు, సమావేశాలను కేంద్రం నిర్వహిస్తుంది.
పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ సురేష్ గోపి రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
(Release ID: 2099333)
Visitor Counter : 11