పర్యటక మంత్రిత్వ శాఖ
హోటల్ మేనేజ్మెంట్ సంస్థల్లో పీపీపీ పద్ధతి
Posted On:
03 FEB 2025 4:34PM by PIB Hyderabad
ఆతిథ్య రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) సామర్థ్యాన్ని గుర్తించిన పర్యాటక శాఖ ఈ దిగువన పేర్కొన్న చర్యలను తీసుకుంది:
ఆతిథ్యరంగ (హాస్పిటాలిటీ) విద్యా సంస్థలు అందిస్తున్న కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలు, వాటి బ్రాండింగ్, మార్కెటింగ్‌కు సంబంధించిన ఇతర అంశాలను సమీక్షించడానికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఓ టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. దీనిలో ఆతిథ్యరంగానికి చెందిన నిపుణులు, ఐహెచ్ఎం విద్యావేత్తలు సభ్యులుగా ఉంటారు.
ఆతిథ్యం, సేవలు, సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించే వ్యక్తులు, నిపుణులను తయారుచేసే లక్ష్యంతో 21 కేంద్ర హోటల్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలకు, 8 అగ్రశ్రేణి ఆతిథ్య సంస్థల మధ్య ఒక అవగాహనా ఒప్పందం కుదిరింది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్, ఐహెచ్‌జీ హోటల్స్ అండ్ రిసార్ట్స్, మారియట్ హోటల్స్, లలిత్ హోటల్ గ్రూప్, ఐటీసీ గ్రూపు ఆఫ్ హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్, అపీజే సురేందర్ పార్క్ హోటల్స్, రాడిసన్ హోటల్స్ గ్రూపు ఈ ఒప్పందంలో భాగస్వాములుగా ఉన్నాయి.
అవగాహనా ఒప్పందంలో భాగంగా ఏర్పాటైన ఈ పరిశ్రమ- విద్యాసంస్థల మధ్య సహకారం, ఆతిథ్యరంగాన్ని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఓ పైలట్ ప్రాజెక్టు. ఆయా సంస్థల్లో.... ఆవిష్కరణలు, ఔత్సాహిక పారిశ్రామిక ఆలోచనలకు మద్ధతు ఇవ్వడం కూడా ఈ ఎంఓయూలో భాగంగా ఉంది.
లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యాటకం, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందించారు.
***
(Release ID: 2099329)
Visitor Counter : 29