పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మహా కుంభమేళా ముఖద్వారంగా కొత్త ప్రమాణాలు నెలకొల్పిన ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం

Posted On: 27 JAN 2025 6:38PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీపౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడుల నాయకత్వంలో ప్రయాగ్ రాజ్ విమానాశ్రయం భక్తిసంస్కృతిమహా కుంభ మహోత్సవ నగరానికి ఆధునిక ముఖద్వారంగా మారింది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా విమానాశ్రయ విస్తరణ చర్యలు చేపట్టారు.

ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో సమర్థవంతమైన కార్యకలాపాలు,  కచ్చితమైన ప్రణాళికసమన్వయం ఫలితం. 2024 డిసెంబర్ 8న శ్రీ రామ్మోహన్ నాయుడు టెర్మినల్ విస్తరణనిర్మాణ పనుల పురోగతిప్రయాణికుల సౌకర్యాలను సమీక్షించిపనుల పూర్తికి గడువును నిర్దేశించారురాష్ట్ర అధికారులుడీజీసీఏబీసీఏఎస్ఏఏఐలతో క్రమం తప్పకుండా తనిఖీలుసమీక్షా సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయించారుజనవరి 9, 2025 సహాయ మంత్రి శ్రీ మురళీధర్ మొహోల్ ప్రయాగ్ రాజ్ విమానాశ్రయంలో పనుల పురోగతిని సమీక్షించారు.

మహా కుంభమేళాకు యాత్రికుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, 2025 జనవరిలో 81 కొత్త విమానాలను ప్రవేశపెట్టారుప్రస్తుతంభారతదేశం నలుమూలల నుండి ప్రయాగ్ రాజ్ కు సుమారు 80000 నెలవారీ సీట్లతో 132 విమానాలు నడుస్తున్నాయిప్రయాగ్ రాజ్ కు 2024 డిసెంబర్ నాటికి ఎనిమిది నగరాలతో విమాన అనుసంధానం ఉండగాప్రస్తుతం భారతదేశంలోని 17 నగరాలతో ప్రత్యక్ష అనుసంధానం కలిగివుందిశ్రీనగర్విశాఖపట్నం సహా 26 నగరాలకు ఇక్కడ నుంచి నేరుగా విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయిప్రయాగ్ రాజ్ ఇప్పుడు భక్తులకు బాగా చేరువైన పవిత్ర యాత్రాస్థలంగా మారింది

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఆదేశాల ప్రకారంకుంభమేళా రద్దీ రోజులు సమీపిస్తున్నందునముఖ్యంగా జనవరి 29, ఫిబ్రవరి తేదీలలో షాహి స్నాన్ఫిబ్రవరి 4, 12, 26 తేదీలలో ఇతర ముఖ్యమైన స్నానాల సమయంలో విమాన ఛార్జీలు అదుపులో ఉండేలా చూడాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఆదేశాలు ఇచ్చారుఅలాగేప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సీట్లను అందుబాటులో ఉంచాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ సూచించింది

1. ఆకాశ ఎయిర్ జనవరి 28, 29 తేదీల్లో అహ్మదాబాద్ ను కలుపుతూ విమానాలను నడపనుందితిరిగి ఫిబ్రవరిలో అహ్మదాబాద్ నుండి తొమ్మిది విమానాలనుబెంగళూరు నుండి 12 విమానాలను ప్రయాగ్ రాజ్ కు నడపాలని యోచిస్తోందివీటి ద్వారా మరో 4000 సీట్లు అందుబాటులోకి వస్తాయి

2. ఇక స్పైస్ జెట్ ఢిల్లీచెన్నైగౌహతిబెంగళూరుఅహ్మదాబాద్ముంబయిజైపూర్హైదరాబాద్ నుంచి ప్రయాగ్ రాజ్ కు 2025 ఫిబ్రవరిలో 43,000 సీట్లతో విమాన సర్వీసులను ప్రారంభించనుంది

ఈ కొత్త విమాన సర్వీసులు ప్రాంతాల మధ్య అనుసంధానంతో పాటు మహా కుంభమేళా సమయంలో ప్రయాగ్ రాజ్ కు వచ్చే ప్రయాణికుల సౌకర్యం కోసం చేస్తున్న ప్రయత్నాలలో భాగంఈ విమానాల చేరికతో విమాన ఛార్జీల భారాన్ని తగ్గించడంతో పాటుభక్తులకు పర్యాటకులకు విమాన ప్రయాణ లభ్యత మెరుగుపడుతుందని భావిస్తున్నారు.

మహా కుంభమేళా సందర్భంగాఈ విమానాశ్రయం మీదుగా 30,172 మంది రాకపోకలు సాగించారుకేవలం ఒక్క వారంలోనే 226 విమానాలు నడిచాయిమొదటిసారిగా ఒకే రోజున ఐదువేల మంది ప్రయాణించిన రికార్డు నమోదయింది. 106 ఏళ్లలో తొలిసారిగా 24/7 కనెక్టివిటీకి వీలుగా రాత్రి విమానాలను ప్రవేశపెట్టారు.

విమానాశ్రయం ఆధునికీకరణలో భాగంగా టెర్మినల్ ప్రాంతాన్ని 6,700 చదరపు మీటర్ల నుండి 25,500 చదరపు మీటర్లకు విస్తరించారుపాత టెర్మినల్ ను  రద్దీ సమయం (పీక్-అవర్లో ప్రస్తుత 540 మంది ప్రయాణికుల నుంచి 1080 మంది వరకు నిర్వహించగలిగేలా పునర్నిర్మించారుఅలాగే, 1,620 మంది ప్రయాణికులకు సేవలందించే కొత్త టర్మినల్‌ను ప్రారంభించారుపార్కింగ్ సామర్థ్యం 200 నుంచి 600 వాహనాలకుచెక్ ఇన్ కౌంటర్లు నుంచి 42కుఎక్స్ బి ఐ ఎస్హెచ్బి యంత్రాలు నుంచి 10కి పెరిగాయిఅదనపు ట్యాక్సీ ట్రాక్పార్కింగ్ బేలను నుంచి 15కుకన్వేయర్ బెల్ట్ లను రెండు నుంచి ఐదుకువిమానాశ్రయ గేట్లను నాలుగు నుంచి 11కు పెంచారుఅదనపు ఏరోబ్రిడ్జ్డోర్ ఫ్రేమ్డ్ మెటల్ డిటెక్టర్లతో సహా మరిన్ని భద్రతా మౌలిక సదుపాయాలను జోడించారు.

లాంజ్ లుపిల్లల సంరక్షణ గదిబోర్డింగ్ వంతెనలు (2 నుండి కు పెంపుజోడించడంతో ప్రయాణికుల సౌకర్యం మరింత మెరుగుపడిందితక్కువ ధరకు ఆహారాన్ని అందించేందుకు ఉడాన్ యాత్రి కేఫ్ కు అనుబంధంగా ఎఫ్ అండ్ బి కౌంటర్లను పెంచారుదివ్యాంగుల కోసం మీట్ అండ్ గ్రీట్ సాయంప్రీపెయిడ్ ట్యాక్సీ కౌంటర్లుయూపీ ప్రభుత్వ సహకారంతో సిటీ బస్ సర్వీసు వంటి కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయిఅంబులెన్స్ఎయిర్ అంబులెన్స్ సేవలతో వైద్య సౌకర్యాలు పెరిగాయిమహాకుంభ్‌కు చేరుకునే యాత్రికులను పుష్పాలతో స్వాగతించివారి యాత్రకు శుభారంభాన్ని ఇస్తున్నారు

ఈ మార్పు 2025 మహా కుంభమేళాను సందర్శించే భక్తులందరికీ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలనుఅంతరాయం లేని కనెక్టివిటీసాటిలేని ప్రయాణ అనుభవాలను అందించే దిశగా ప్రభుత్వ నిబద్ధతను చాటి చెబుతుంది.

 

***


(Release ID: 2097011) Visitor Counter : 12