ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆస్తి సొంతదారులకు స్వామిత్వ పథకంలో భాగంగా

65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను జనవరి 18న పంపిణీ చేయనున్న ప్రధానమంత్రి

లక్షిత గ్రామాల్లోని 92 శాతం డ్రోన్ సర్వే ఇప్పటికే పూర్తి

దాదాపుగా 2.25 కోట్ల ఆస్తి కార్డులు సిద్ధం

Posted On: 16 JAN 2025 7:22PM by PIB Hyderabad

స్వామిత్వ పథకంలో భాగంగా 65 లక్షలకు పైగా ఆస్తి కార్డులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపిణీ చేయనున్నారుజనవరి 18న మధ్యాహ్నం సుమారు 12 గంటల 30 నిమిషాలకు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రధాని 10 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 230కి పైగా జిల్లాల్లో 50,000కు పైగా గ్రామాల్లో ఆస్తి సొంతదారులకు ఈ ఆస్తి కార్డుల్ని పంపిణీ చేస్తారు.

పల్లెవాసుల కుటుంబాలకు సర్వేలో తేలిన ప్రకారం అత్యంత ఆధునిక డ్రోన్ మాధ్యమం ద్వారా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్’ (హక్కులను సూచించే పత్రం)ను అందించడం ద్వారా భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల ఆర్థిక వృద్ధికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో ప్రధాని ఈ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకోవడానికి  కూడా సాయపడుతుందిఅలాగే బ్యాంకు రుణాల మాధ్యమం ద్వారా సంస్థాగత రుణాలు పొందడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తుందిఆస్తులకు సంబంధించిన వివాదాల్ని తగ్గిస్తుందిగ్రామీణ ప్రాంతాల్లో ఆస్తుల్నీఆస్తి పన్నుల్నీ మెరుగైన విధంగా లెక్కగట్టడానికి మార్గాన్ని సుగమం చేస్తుందిగ్రామాల స్థాయిలో విస్తృత ప్రణాళికలను రూపొందించడానికీ ఈ పథకం తోడ్పడుతుంది.

డ్రోన్ సర్వేను మొత్తం 3.17 లక్షలకు పైగా గ్రామాల్లో చేశారు. ఈ ప్రక్రియను లక్షిత గ్రామాల్లోని 92 శాతం వరకూ పూర్తి చేయడం విశేషం. ఇప్పటి వరకు 1.53 లక్షల కన్నా ఎక్కువ  గ్రామాలకుగాను దాదాపుగా 2.25 కోట్ల ప్రాపర్టీ కార్డుల్ని సిద్ధం చేశారు.

ఈ పథకాన్ని పుదుచ్చేరిఅండమాన్ నికోబార్ దీవులుత్రిపురగోవాఉత్తరాఖండ్‌లతోపాటు హర్యానాలో పూర్తి స్థాయిలో అమలు చేశారుమధ్య ప్రదేశ్ఉత్తర ప్రదేశ్‌ ఛత్తీస్‌గఢ్‌లతోపాటు అనేక కేంద్రపాలిత ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సర్వే ప్రక్రియను కూడా పూర్తి చేశారు.


***


(Release ID: 2093749) Visitor Counter : 53