ప్రధాన మంత్రి కార్యాలయం
మహా కుంభమేళా భారతదేశ నిత్య నూతన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, నమ్మకాన్ని, సామరస్యాన్ని పెంపొందించే ఉత్సవం: ప్రధానమంత్రి
Posted On:
13 JAN 2025 9:08AM by PIB Hyderabad
మహా కుంభమేళా 2025 ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రయాగ్ రాజ్ లోని ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ విలువలను, సంస్కృతిని ఆదరించే కోట్లాది మందికి ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని శ్రీ మోదీ పేర్కొన్నారు. మహా కుంభమేళా కాలానికి అతీతమైన భారతీయ ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని, నమ్మకాన్ని, సామరస్యాన్ని పెంపొందించే ఉత్సవమని అన్నారు.
"భారతీయ విలువలు, సంస్కృతిని ప్రేమించే కోట్లాది ప్రజలకు ఇది ఒక ప్రత్యేకమైన రోజు! ప్రయాగరాజ్‌లో మహా కుంభ్ 2025 ప్రారంభం అయింది. విశ్వాసం, భక్తి, సంస్కృతుల పవిత్ర సంగమంలో అసంఖ్యాక ప్రజలను ఏకం చేస్తోంది. మహా కుంభ్ భారతదేశ నిత్యమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, విశ్వాసం సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది”.
“ప్రయాగరాజ్‌లో అనేక మంది వచ్చి పుణ్యస్నానం చేసి ఆశీర్వాదాలు పొందుతుండటం చూసి నాకు ఆనందంగా ఉంది. ఈ ఆధ్యాత్మిక ఉత్సవం యాత్రికులకు, పర్యాటకులకు అద్భుతమైన అనుభవం అందించాలని కోరుకుంటున్నాను”.
“పవిత్ర పుణ్యక్షేత్రమైన ప్రయాగ్ రాజ్ లో నేటి నుంచి పుష్య పౌర్ణమి సందర్భంగా పవిత్ర స్నానంతో మహా కుంభమేళా ప్రారంభమైంది. మన విశ్వాసం, సంస్కృతితో ముడిపడి ఉన్న ఈ దివ్య సందర్భంలో భక్తులందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భారతీయ ఆధ్యాత్మిక ఈ సంప్రదాయ గొప్ప పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
***
(Release ID: 2092507)
Visitor Counter : 22
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam