ప్రధాన మంత్రి కార్యాలయం
జనవరి 15న మహారాష్ట్రలో ప్రధానమంత్రి పర్యటన
ముంబయిలోని నేవల్ డాక్ యార్డ్ లో మూడు ఫ్రంట్ లైన్ నేవీ ఫైటర్స్ - ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి
నవీ ముంబయిలోని ఖార్ఘర్ లో ఇస్కాన్ ఆలయానికి ప్రారంభోత్సవం చేయనున్న ప్రధానమంత్రి
Posted On:
13 JAN 2025 11:16AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జనవరి 15న మహారాష్ట్రలో పర్యటిస్తారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు ముంబయిలోని నావల్ డాక్ యార్డ్ లో మూడు ఫ్రంట్ లైన్ నేవీ యుద్ధ నౌకలు- ఐఎన్ ఎస్ సూరత్, ఐఎన్ ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ ఎస్ వాఘ్షీర్ లను ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు నవీ ముంబయిలోని ఖార్ఘర్ లో ఇస్కాన్ ఆలయాన్ని ప్రారంభిస్తారు.
మూడు ప్రధాన నావికాదళ యుద్ధ నౌకలను ప్రారంభించడం రక్షణ తయారీ, సముద్ర భద్రతలో ప్రపంచ సారధ్యం వహించాలనే భారతదేశ దార్శనికతను సాకారం చేయడంలో గణనీయమైన ముందడుగును సూచిస్తుంది. పి 15 బి గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ లోని నాలుగో చివరి నౌక అయిన ఐఎన్ఎస్ సూరత్ ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత అధునాతన శత్రు విధ్వంసక నౌకల్లో ఒకటి. ఇది 75 శాతం స్వదేశీ పరిజ్ఞానాన్ని అత్యాధునిక ఆయుధ-సెన్సర్ ప్యాకేజీలు, అధునాతన నెట్వర్క్-కేంద్రీకృత సామర్థ్యాలను కలిగి ఉంది. ఇక ఐఎన్ఎస్ నీలగిరి పి17ఎ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్ట్ మొదటి నౌక. భారత నావికాదళానికి చెందిన యుద్ధనౌకల డిజైన్ బ్యూరో దీనిని రూపొందించింది. ఇది మెరుగైన మనుగడ, సీ కీపింగ్, స్టెల్త్ కోసం అధునాతన లక్షణాలను కలిగి ఉంది. తరువాతి తరం స్వదేశీ యుద్ధనౌకలకు ప్రతీక. పి 75 స్కార్పీన్ ప్రాజెక్ట్ లో ఆరో చివరి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్ జలాంతర్గామి నిర్మాణంలో భారతదేశ అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాన్ని చాటుతుంది. దీనిని నేవల్ గ్రూప్ ఆఫ్ ఫ్రాన్స్ సహకారంతో నిర్మించారు.
భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే నిబద్ధతకు అనుగుణంగా ప్రధానమంత్రి ఈ పర్యటనలో నవీ ముంబయి లోని ఖార్ఘర్ లో ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. తొమ్మిది ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులో అనేక దేవతలతో కూడిన ఆలయం, వేద విద్యా కేంద్రం, ప్రతిపాదిత మ్యూజియంలు ఆడిటోరియం, హీలింగ్ సెంటర్ ఉన్నాయి. వైదిక బోధనల ద్వారా విశ్వమానవ సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యం.
***
(Release ID: 2092501)
Visitor Counter : 18
Read this release in:
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam