మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
పశువుల వ్యాక్సిన్ ఆవిష్కరణపై హైదరాబాద్ లో శాస్త్రీయ సదస్సు
Posted On:
11 JAN 2025 1:54PM by PIB Hyderabad
మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్, నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) సహకారంతో 2025 జనవరి 10న హైదరాబాద్ లో అంటువ్యాధుల సన్నద్ధత, వ్యాక్సిన్ ఆవిష్కరణపై సదస్సు నిర్వహించారు.
నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) ప్రొఫెసర్ డాక్టర్ వినోద్ కె పాల్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో వచ్చే వైరస్ మహమ్మారులను సమర్థంగా ఎదుర్కొనేందుకు పశువైద్య మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా కొత్తగా వ్యాపిస్తున్న వ్యాధులను ముందుగానే గుర్తించి వేగంగా ప్రతిస్పందించేలా రోగనిర్ధారణ సౌకర్యాలను పెంచాలని అన్నారు. తదుపరి తరం జంతు వ్యాక్సిన్ల అభివృద్ధి, ఉత్పత్తి కోసం అధునాతన వేదికలను ఏర్పాటు చేయాల్సిన ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఇవి జంతు సాంక్రామిక వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి, జంతు, మానవ ఆరోగ్యాన్ని రక్షించడానికి కీలకమైనవి. ఈ క్లిష్టమైన అంశాలను బలోపేతం చేయడం అనేది వన్ హెల్త్ విధానం కింద సుస్థిర ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించే విస్తృత లక్ష్యానికి అనుగుణంగా ఉంటుందని ఆయన అన్నారు.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ మాట్లాడుతూ, మెరుగైన ఉత్పాదకత కోసం ప్రభుత్వం జంతువుల ఆరోగ్యంపై ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని, అంతేవాసుల వరకు సమర్థవంతంగా వ్యాక్సిన్ సరఫరా చేయడానికి సరఫరా, కోల్డ్ చైన్ వ్యవస్థలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
పశుసంవర్ధక శాఖ కమిషనర్ డాక్టర్ అభిజిత్ మిత్రా తన ప్రసంగంలో, టీకా భద్రత, జంతు టీకాలకు ముందస్తు అర్హతలను నిర్ధారించాల్సిన అవసరాన్ని వివరించారు.
వ్యాక్సినేషన్ కార్యక్రమాలను మెరుగుపరచడం, పశువుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మహమ్మారి సిద్ధత కోసం ధృడమైన సరఫరా వ్యవస్థలను నిర్మించడం, మహమ్మారి స్పందనలను బలోపేతం చేయడం, వ్యాధి పర్యవేక్షణను పటిష్టం చేయడం, వ్యాక్సిన్ పరీక్షలను సులభతరం చేయడం, ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు అభివృద్ధి, కణ, జన్యు చికిత్స వ్యాక్సిన్లు, అలాగే ఆమోదానికి సంబంధించిన నియంత్రణ మార్గాల పై దృష్టితో ఈ సదస్సు “వన్ హెల్త్” కు సంబంధించిన వివిధ అంశాలపై సమగ్రమైన అవగాహన పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సంయుక్త కార్యదర్శి (పశు ఆరోగ్యం) రామ శంకర్ సిన్హా, ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె.ఆనంద్ కుమార్, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ జూ అథారిటీ మెంబర్ సెక్రటరీ డాక్టర్ సంజయ్ శుక్లా, డాక్టర్ బీఆర్ గులాటీ, డైరెక్టర్ ఎన్ఐవీడీ, ఇంకా ఆరోగ్య రంగ నిపుణులు, వ్యాక్సిన్ పరిశ్రమ, సీడీఎస్సీఓ తదితర రంగాలకు చెందిన భాగస్వాములు ఈ సదస్సులో పాల్గొన్నారు.
భారతదేశం : గ్లోబల్ వ్యాక్సిన్ హబ్
60 శాతానికి పైగా వ్యాక్సిన్లు భారత్ లో తయారవుతుండగా, 50 శాతానికి పైగా వ్యాక్సిన్ తయారీదారులు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి మద్దతుతో పశుసంవర్థక, పాడిపరిశ్రమ శాఖ పశువులలో ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఫుట్ అండ్ మౌత్ వ్యాధి నిరోధానికి టీకాలు వేయడానికి (102 కోట్ల టీకాలు పూర్తయ్యాయి) (డబ్ల్యుఓఎహెచ్ ఆమోదం పొందింది) బ్రూసెల్లోసిస్ (4.23 కోట్ల టీకాలు పూర్తయ్యాయి), పెస్టే డెస్ పెటిట్స్ రుమినాంట్స్ (పిపిఆర్) (17.3 కోట్ల టీకాలు పూర్తయ్యాయి), క్లాసికల్ స్వైన్ ఫీవర్ (0.59 కోట్ల టీకాలు పూర్తయ్యాయి). దీని కింద ప్రతి ప్రతి పశువుకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (యుఐడి) ఇచ్చి భారత పశుధన్ అంటే నేషనల్ డిజిటల్ లైవ్‌స్టాక్ మిషన్‌లో నమోదు చేస్తారు. ఇది టీకా షెడ్యూల్ ను ట్రాక్ చేస్తుంది. అమలును నిర్ధారిస్తుంది. ఇటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు దేశంలో ప్రధాన పశు సంబంధ వ్యాధుల వ్యాప్తి గణనీయంగా తగ్గడానికి దారి తీసింది .
***
(Release ID: 2092250)
Visitor Counter : 56