రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

29 క్రీడా విభాగాల్లో 9,000 మంది ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ భారత క్రీడా రంగానికి ఊతమిస్తున్న రైల్వేలు


జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తున్న రైల్వే క్రీడాకారులు

అయిదుగురు రైల్వే అథ్లెట్లకు 2024వ సంవత్సర ‘అర్జున పురస్కారాలు’

అవార్డుల ప్రదానానికి జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం

Posted On: 02 JAN 2025 6:27PM by PIB Hyderabad

భారతీయ రైల్వేలు తన క్రీడా విభాగమైన రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్ఎస్‌పీబీద్వారా 1928 నుంచీ దేశవ్యాప్తంగా క్రీడలను ప్రోత్సహిస్తోంది. హాకీటెన్నిస్, ఇతర వ్యాయామ క్రీడలకూ మద్దతు అందిస్తూ ఆర్ఎస్‌పీబీ తన కార్యకలాపాలను చిన్నగా ప్రారంభించింది. క్రీడలపట్ల దేశం నలుమూలలా ఆదరణ లభించేటట్టు చేయడంలో ముఖ్య పాత్రను రైల్వే పోషిస్తోందిదీని పరిధిలో 29 క్రీడా విభాగాలున్నాయివాటిలో 18 ఆటలు వ్యక్తిగత ఆటలు11 ఆటలేమో జట్టుగా ఆడే ఆటలుఆర్ఎస్‌పీబీకి 28 జాతీయ క్రీడా సమాఖ్యలతోనూయూఎస్ఐసీ (వరల్డ్ రైల్వేస్ స్పోర్ట్స్ అసోసియేషన్)తోనూ అనుబంధం ఉంది.

ఉద్యోగాలివ్వడం ద్వారా అనేక మంది క్రీడాకారులకు భారతీయ రైల్వేలు మద్దతు పలుకుతున్నదిఇంత వరకు చూస్తే29 క్రీడాంశాలకు చెందినవారు క్రీడాకారులుక్రీడాకారిణులు కలుపుకొని మొత్తం 9000 మందికి పైగా భారతీయ రైల్వేల ఛత్రఛాయలో ఉన్నారువారిలో సుమారు 3000 మంది క్రియాశీల క్రీడాకారులు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక ఈవెంట్లలో ఐఆర్ క్రీడాకారులు ప్రశంసనీయమైన ఆటతీరు కనబరిచారు.

యువజన వ్యవహారాలుక్రీడల మంత్రిత్వ శాఖ 2024వ సంవత్సరానికి జాతీయ క్రీడాపురస్కారాలను ప్రకటించిందిప్రతిష్ఠాత్మక అర్జున పురస్కారాన్ని 32 మంది క్రీడాకారులకు ప్రకటించగా అందులో అయిదుగురు క్రీడాకారులు ఇండియన్ రైల్వేలకు చెందిన వారే ఉండడం గర్వకారణంఆయా ఆటగాళ్లువారు పాల్గొన్న ఈవెంట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

1.    జ్యోతి యర్రాజిదమరై (అథ్లెటిక్స్విభాగం100 మీహర్డిల్స్)

2.    అన్ను రాణిపీఎల్‌డబ్ల్యూ (అథ్లెటిక్స్విభాగంజావెలిన్ త్రో)

3.    సలీమా టెటెఎస్ఈఆర్ (హాకీ)

4.    స్వప్నిల్ సురేశ్ కుసాలేసీఆర్ (షూటింగ్-50 మీ3పీ)

5.    అమన్ఎన్ఆర్ (కుస్తీ-57 కి.గ్రాఫ్రీస్టయిల్)

ఈ అయిదు అర్జున అవార్డులను కలుపుకొంటే మొత్తం 183 అర్జున, 28 పద్మ శ్రీ, 12 ధ్యాన్ చంద్, 13 ద్రోణాచార్య పురస్కార విజేతలతోపాటు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కార గ్రహీతలు రైల్వేల్లో న్నారుఇంత పెద్ద సంఖ్యలో పురస్కార విజేతలు మన దేశంలో మరే సంస్థలోనూ లేరుతాజా పురస్కార విజేతలు తమ అవార్డులను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా 2025 జనవరి 17న రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించే ఒక ప్రత్యేక కార్యక్రమంలో అందుకోనున్నారు.

ఈ మెరికలను రైల్వే అభినందనలను తెలియజేస్తూరాబోయే కాలంలో కూడా ఇంకా పైకెదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు వ్యక్తం చేస్తోంది.

 

***


(Release ID: 2089911) Visitor Counter : 19