ప్రధాన మంత్రి కార్యాలయం
రామాయణ, మహాభారతాలు అరబిక్ భాషలోకి అనువాదం: శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లకు ప్రధానమంత్రి ప్రశంసలు
Posted On:
21 DEC 2024 7:03PM by PIB Hyderabad
రామాయణాన్ని, మహాభారతాన్ని అరబిక్ భాషలోకి అనువాదం చేసి ప్రచురించినందుకు శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:
‘‘రామాయణ, మహాభారతాల అరబ్బీ భాషా అనువాదాలను చూసి సంతోషం కలిగింది. వాటి అనువాదాలను సిద్ధం చేసి ప్రచురించడానికి శ్రీ అబ్దుల్లా అల్-బరూన్, శ్రీ అబ్దుల్ లతీఫ్ అల్-నసేఫ్‌లు చేసిన కృషిని నేను మెచ్చుకొంటున్నాను. వారి ఈ ప్రయత్నం భారతీయ సంస్కృతికున్న ప్రజాదరణను ప్రపంచ స్థాయిలో ప్రధానంగా చాటిచెబుతోంది.’’
***
(Release ID: 2087100)
Visitor Counter : 35
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam