ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ ఓం ప్రకాశ్ చౌతాలా మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 20 DEC 2024 1:51PM by PIB Hyderabad

హర్యానా మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఓం ప్రకాశ్ చౌతాలా మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్ లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘హర్యానా పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ఓం ప్రకాశ్ చౌతాలా గారు మన మధ్య ఇక లేరని తెలిసి అత్యంత దు:ఖం కలిగింది. రాష్ట్ర రాజకీయాలలో ఆయన సంవత్సరాల తరబడి క్రియాశీలంగా ఉన్నారు. అంతేకాక చౌధరీ దేవీలాల్ గారు తీసుకున్న కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి ఆయన నిరంతరం ప్రయత్నించారు. ఈ శోక ఘడియలో ఆయన కుటుంబసభ్యులకూ, ఆయన మద్దతుదారులకూ నేను నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’.

******

MJPS/SR/SKS


(Release ID: 2086691) Visitor Counter : 14