ప్రధాన మంత్రి కార్యాలయం
అండమాన్ నికోబార్ లోని దీవులకు మన వీరుల పేర్లు పెట్టడమంటే వారి సేవలు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా చేయడమే: ప్రధానమంత్రి
మూలాలతో అనుసంధానమైన దేశాలు అభివృద్ధి, దేశ నిర్మాణంలో ముందుంటాయి: ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
18 DEC 2024 2:37PM by PIB Hyderabad
అండమాన్ నికోబార్ ప్రాంతంలోని దీవులకు మన వీరుల పేర్లు పెట్టడమన్నది దేశానికి వారందించిన సేవలు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా చూసే మార్గమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మూలాలతో అనుసంధానమై ఉన్న దేశాలు అభివృద్ధి, జాతి నిర్మాణంలో ముందున్నాయని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో శివ్ అరూర్ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూ ఆయన ఇలా వ్యాఖ్యానించారు:
“అండమాన్, నికోబార్‌లోని దీవులకు మన యోధుల పేర్లను పెట్టడమన్నది దేశానికి వారు చేసిన సేవలను రాబోయే తరాలు గుర్తుంచుకునే మార్గం. దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మన స్వాతంత్ర్య సమరయోధులు, విశిష్ట వ్యక్తుల జ్ఞాపకాలను పదిలపరచి, వాటిని ఘనంగా చాటే మా విస్తృతమైన కృషిలోనూ ఇది భాగం.
అన్నిటికీ మించి, మూలాలతో అనుసంధానమైన దేశాలే అభివృద్ధిలో, జాతి నిర్మాణంలో ముందుకు సాగుతాయి.
నామకరణ కార్యక్రమంలో నా ప్రసంగాన్ని కూడా ఇక్కడ జతచేస్తున్నాను https://www.youtube.com/watch?v=-8WT0FHaSdU.
అలాగే, అండమాన్-నికోబార్ దీవులను ఆస్వాదించండి. సెల్యులార్ జైలును కూడా సందర్శించండి, యోధుడు వీర సావర్కర్ ధైర్యసాహసాల నుంచి స్ఫూర్తిని పొందండి”.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2085698)
आगंतुक पटल : 92
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam