ప్రధాన మంత్రి కార్యాలయం
ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం నన్ను కలిచివేసింది: ప్రధానమంత్రి
Posted On:
17 DEC 2024 5:19PM by PIB Hyderabad
ఫ్రాన్స్, మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ విపత్కర సమయంలో ఫ్రాన్స్ కు మద్దతుగా నిలుస్తున్నామని, అవసరమైన సహాయాన్నందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. దేశాధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రోన్ నేతృత్వంలో దేశం ఈ విపత్తుని ధైర్యంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని ప్రధాని వ్యక్తం చేశారు.
ఫ్రాన్స్ తుఫాను గురించి ప్రధాని ‘ఎక్స్’ లో స్పందిస్తూ:
“మయోట్ లో చీడో తుఫాను సృష్టించిన విలయం నన్ను కలిచివేసింది. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్షుడు ఇమాన్యువల్ మాక్రోన్ నేతృత్వంలో దేశం ఈ ఆపదను ధైర్యంగా ఎదుర్కోగలదన్న విశ్వాసం నాకుంది. ఈ కష్టకాలంలో ఫ్రాన్స్ కు మద్దతుగా నిలుస్తున్నాం, అవసరమైన సహాయాన్నందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
***
MJPS/SR/SKS
(Release ID: 2085489)
Visitor Counter : 20
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam