ప్రధాన మంత్రి కార్యాలయం
దిగ్గజ నటుడు రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రధాని
ఆయన కేవలం సినిమా రూపకర్తే కాదు...సాంస్కృతిక రాయబారి కూడా: పీఎం
प्रविष्टि तिथि:
14 DEC 2024 11:10AM by PIB Hyderabad
దిగ్గజ నటుడు శ్రీ రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులు అర్పించారు. ఆయన దూరదృష్టి గల సినీ రూపకర్త, నటుడు, వెండితెర సార్వభౌముడనీ ప్రధాని కొనియాడారు. శ్రీ రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదని భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సాంస్కృతిక రాయబారిగా వర్ణిస్తూ, అనేక తరాలపాటు సినిమా దర్శకులు, నటులు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని శ్రీ మోదీ అన్నారు.
శ్రీ మోదీ ఎక్స్‌లో చేసిన పోస్టు:
‘‘ఈ రోజు దిగ్గజ నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ శత జయంతిని జరుపుకుంటున్నాం. ఆయన దూరదృష్టి గల సినీ రూపకర్త, నటుడు, వెండితెర సార్వభౌముడు. ఆయన భారతీయ, అంతర్జాతీయ చిత్ర రంగంపై తరాలు మారినా చెరగని ముద్ర వేశారు’’
‘‘శ్రీ రాజ్ కపూర్‌కు చిన్న వయసులోనే సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఆదర్శవంతమైన కథకుడిగా ఎదిగేందుకు కష్టపడి పనిచేశారు. ఆయన సినిమాలు- కళానైపుణ్యం, భావుకత, సామాజిక వ్యాఖ్యానాల సమ్మేళనం. అవి సామాన్యుల ఆకాంక్షలను, వారు సాగించే జీవన సమస్యల్ని ప్రతిబింబిస్తాయి’’.
‘‘రాజ్ కపూర్ చిత్రాల్లోని పాత్రలు, మరచిపోలేని మధుర గీతాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. వైవిధ్యమైన ఇతివృత్తాలను సులభంగా, గొప్పగా చిత్రీకరించిన ఆయన పనితీరును ప్రజలు మెచ్చుకుంటారు. ఆయన సినిమాల్లోని సంగీతం కూడా ప్రజాదరణ పొందింది.
‘‘శ్రీ రాజ్ కపూర్ చిత్ర దర్శకుడు మాత్రమే కాదు భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన సాంస్కృతిక రాయబారి. తరాలు మారినా చిత్ర దర్శకులు, నటులు ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. సృజనాత్మక ప్రపంచానికి ఆయన చేసిన సేవల్ని గుర్తు చేసుకుంటూ.. మరోసారి ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను’’.
***
MJPS/SR
(रिलीज़ आईडी: 2084497)
आगंतुक पटल : 64
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam