రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

1000 కోట్ల విలువైన గ్రీన్ బాండ్లను జారీ చేయనున్న ఎన్‌హెచ్ఏఐ


సౌర దీపాలు, వర్షపు నీటి సంరక్షణ, అటవీ జంతువుల కోసం

అండర్ పాస్‌ల నిర్మాణాలకు గ్రీన్ బాండ్ల ద్వారా నిధుల సమీకరణ

Posted On: 05 DEC 2024 4:57PM by PIB Hyderabad

పర్యావరణ సుస్థిరతహరిత జాతీయ రహదారులను అభివృద్ధి చేసే దిశగా తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సంస్థ ‘డీఎంఈ డెవలప్మెంట్ లిమిటెడ్’ (డీఎంఈడీఎల్గ్రీన్ బాండ్లను జారీ చేస్తుందిఢిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టులో పర్యావరణహిత ప్రమాణాలను అమలు చేసేందుకుగాను నిధుల సమీకరణకు ఈ గ్రీన్ బాండ్లను జారీ చేస్తుందిరహస్య బిడ్డింగ్ విధానంలో జరిగే ప్రక్రియలో రూ. 500 కోట్ల బేస్ ఇష్యూతో రూ. 1000 కోట్ల వరకు బాండ్లను జారీ చేస్తారురూ. 500 కోట్ల వరకు ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌ను నిలుపుకోవడానికి గ్రీన్ షూ ఆప్షన్ ఉందిరోడ్లుజాతీయ రహదారుల విభాగంలో తొలిసారిగా మొదలుపెట్టిన గ్రీన్ బాండ్ల జారీ ప్రక్రియ ఈ నెల (డిసెంబర్ 2024) రెండో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందిభారత ప్రభుత్వ హరిత బాండ్ల నియమావళిఅంతర్జాతీయ నిబంధనలుసెబీ మార్గదర్శకాలకు లోబడి ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

 

గ్రీన్ బాండ్ల’ జారీ ద్వారా చేకూరే ఆదాయాన్ని రహదారికి ఇరువైపులామధ్యలో మొక్కలు పెంచడానికిజంతువులు వెళ్లేందుకు వీలుగా అండర్ పాస్‌లు నిర్మించడానికివరద నీటి పారుదల నిర్మాణాలు చేపట్టడానికిపునరుత్పాదక శక్తి ఆధారిత (సోలార్వీధి దీపాలు ఏర్పాటు చేయడానికిచెత్త రీసైక్లింగ్ పునర్వినియోగానికివర్షపు నీటి సంరక్షణకు ఉపయోగిస్తారు.

 

ఈ కార్యక్రమంపై ఎన్‌హెచ్ఏఐ ఛైర్మన్ శ్రీ సంతోష్ కుమార్ యాదవ్ స్పందిస్తూ ‘‘పచ్చదనం నిండిన రహదారులను ఏర్పాటు చేసే లక్ష్యంలో ఈ కార్యక్రమం ఒక భాగంపర్యావరణ సుస్థిరత పట్ల ఎన్‌హెచ్ఏఐ కృతనిశ్చయాన్ని స్పష్టం చేస్తుందిఈ హరిత బాండ్లు పర్యావరణహిత ప్రాజెక్టుల్లో ముఖ్యంగా రోడ్లుజాతీయ రహదారుల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించిఇంధన వినియోగాన్ని తగ్గించిపర్యావరణంపై వాహన ఉద్ఘారాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.’’

 

ఇది రుణాలను ఖర్చు చేసే అంశంలో డీఎంఈడీఎల్ ఆర్థిక పనితీరును మెరుగుపరిచేందుకు ఈ బాండ్ల జారీ తోడ్పడుతుందిఅలాగే ‘పర్యావరణసామాజికపాలన’ కేంద్రంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తుందిథర్డ్ పార్టీ రివ్యూవర్ (టీపీఆర్)గా నియమించిన కేర్ ఎడ్జ్ అనలిటిక్స్ అనే సంస్థ డీఎంఈడీఎల్ హరిత విధానాలను గుర్తించి నిర్ధారిస్తుంది.

 

ఎన్‌‌హెచ్ఏఐ ఆగస్టు 2020న ఎన్‌హెచ్ఏఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘డీఎంఈ డెవలప్మెంట్ లిమిటెడ్’ ఢిల్లీ ముంబయి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే పెట్టుబడులునిర్మాణంనిర్వహణను పర్యవేక్షిస్తుందిఈ సంస్థ క్రిసిల్కేర్ఇండియా రేటింగ్ నుంచి ఏఏఏ రేటింగ్ సాధించిందిడిల్లీ ముంబయి ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టు అమలుకు బ్యాంకులుఫైనాన్సియల్ మార్కెట్ల నుంచి రుణాలుబాండ్ల ద్వారా రూ. 48,000 కోట్ల రూపాయలు సేకరించాలని డీఎంఈడీఎల్ లక్ష్యంగా పెట్టుకుంది.

 

***


(Release ID: 2081791) Visitor Counter : 36


Read this release in: English , Urdu , Hindi , Punjabi