సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వారసత్వ ప్రదేశాల పరిరక్షణ
Posted On:
05 DEC 2024 4:36PM by PIB Hyderabad
పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 (ఏఎంఏఎస్ఆర్ చట్టం, 1958)లోని సెక్షన్ 4లో పురాతన స్మారక చిహ్నాన్ని లేదా పురావస్తు ప్రదేశాన్ని, వాటి అవశేషాలను జాతీయ ప్రాధాన్యం కలిగినవిగా ప్రకటించేందుకు నిబంధన ఉంది. పురావస్తు, చారిత్రక, నిర్మాణ ప్రాముఖ్యతను బట్టి వాటిని జాతీయ ప్రాధాన్యమున్నవిగా ప్రకటించే అధికారాన్ని కేంద్రానికి ఏఎంఏఎస్ఆర్ చట్టం 1958లోని సెక్షన్ 4 అందిస్తుంది.
రెండు నెలల గడువుతో ప్రజల నుంచి అభ్యంతరాలను ఆహ్వానిస్తూ గెజిట్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్ జారీ చేస్తారు. నిర్ణీత కాలవ్యవధిలో స్వీకరించిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం అధికారిక గెజిట్లో నోటిఫికేషన్ ప్రచురించడం ద్వారా ప్రాచీన చిహ్నాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగినదిగా భారత ప్రభుత్వం ప్రకటిస్తుంది.
హర్యానాలోని ఈ దిగువన తెలిపిన పురావస్తు ప్రదేశాలను జాతీయ ప్రాధాన్యమున్న ప్రాంతాలుగా గెజిట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు.
(I) హిస్సార్ జిల్లాలోని రాఖీఘర్హి వద్ద ఉన్న ప్రాచీన మట్టి దిబ్బ సంఖ్య VI (హర్యానా)
(ii) హిస్సార్ జిల్లాలోని రాఖీగర్హి వద్ద ఉన్న ప్రాచీన మట్టి దిబ్బ సంఖ్య VII (హర్యానా)
ఈ రోజు రాజ్యసభలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ లిఖిత పూర్వకంగా ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 2081402)
Visitor Counter : 44