సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
పార్లమెంటులో ప్రశ్న: ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (పీఎం-అజయ్) పథకం
Posted On:
04 DEC 2024 2:44PM by PIB Hyderabad
ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన (పీఎం-అజయ్) 2021-22 నుంచి అమలు చేస్తున్న కేంద్ర ప్రాయోజిత పథకం. స్థూలంగా ఈ పథకంలో మూడు భాగాలున్నాయి - (i) ‘ఆదర్శ గ్రామం’, (ii) ‘షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతి కోసం జిల్లా/రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులకు ఆర్థికసాయం, (iii) ‘వసతిగృహం’
ఈ పథకం లక్ష్యాలు, పాత్ర:
-
ఎస్సీలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో తగిన మౌలిక సదుపాయాలు, అవసరమైన సేవలు అందించడం ద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధి సూచీలను మెరుగుపరచడం.
-
నైపుణ్యాభివృద్ధి, ఆదాయ కల్పన పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా అదనపు ఉపాధి అవకాశాలను కల్పించి ఎస్సీ వర్గాల్లో పేదరికాన్ని తగ్గించడం.
-
నాణ్యమైన సంస్థాగత ఏర్పాట్ల ద్వారా తగిన నివాస సదుపాయాల కల్పనతోపాటు అవసరమైన చోట్ల.. ప్రత్యేకంగా అభిలషణీయ జిల్లాలు/ఎస్సీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో ఆవాస పాఠశాలలు ఏర్పాటు చేయడం ద్వారా అక్షరాస్యతను పెంచడం, పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఎస్సీల నమోదును పెంచడం.
2021-22 నుంచి 5185 మంది లబ్ధిదారులకు మొత్తం 46 హాస్టళ్లు మంజూరయ్యాయి. పీఎం-అజయ్ లో హాస్టల్ విభాగానికి రూ.126.30 కోట్లు విడుదలయ్యాయి.
కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి శ్రీ రాందాస్ అథవాలే రాజ్యసభలో ఓ ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 2080894)
Visitor Counter : 105