పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పార్లమెంట్ ప్రశ్న: సముద్ర జీవుల పరిరక్షణ

Posted On: 02 DEC 2024 4:08PM by PIB Hyderabad

సముద్ర జీవ జాతులను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన వివిధ చర్యలను చేపట్టిందిఅవి:

  1. వన్యప్రాణుల (రక్షణచట్టం, 1972 ప్రకారం దేశవ్యాప్తంగా తీరప్రాంత రాష్ట్రాలుదీవుల్లో సముద్ర జీవుల సంరక్షణకు రక్షిత ప్రాంతాల వ్యవస్థను ఏర్పాటు చేశారు.

  2. అంతరించిపోతున్న సముద్ర జాతులను వన్యప్రాణుల (సంరక్షణచట్టం, 1972లో షెడ్యూల్ I, II లో చేర్చి వాటిని వేటాడకుండా రక్షణ కల్పించారు.

  3. వన్యప్రాణుల (సంరక్షణచట్టం, 1972ను మంత్రిత్వశాఖ సవరించిచట్టాన్ని అతిక్రమించిన సమయాలు ఎదురైనప్పుడు తీరరక్షక దళానికి ప్రవేశంశోధనఅరెస్టు లేదా నిర్భంధించే అధికారాలను కల్పించింది.

  4. భారతదేశంలో సముద్ర తాబేళ్లువాటి ఆవాసాలను పరిరక్షించేందుకు జాతీయ సముద్ర తాబేళ్ల కార్యాచరణ ప్రణాళికను మంత్రిత్వశాఖ విడుదల చేసింది.

  5. సముద్రంలో అపాయంలో చిక్కుకుపోయిన పెద్ద సముద్ర జీవుల్ని రక్షించేందుకు ‘మెరైన్ మెగాఫానా స్ట్రాండింగ్ మేనేజ్మెంట్ గైడ్‌లైన్స్’ ను 2021లో మంత్రిత్వశాఖ జారీ చేసింది.

  6. పర్యావరణ (పరిరక్షణచట్టం 1986 ప్రకారంకోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ (సీఆర్‌జెడ్నోటిఫికేషన్ ను 2019లో జారీ చేశారుఇది పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతాలు (ఈఎస్ఏలుఅయిన మడ అడవులుసముద్రపు గడ్డిఇసుక తిన్నెలుప్రవాళాలుప్రవాళ దిబ్బలుఅనేక జీవులకు ఆవాసమిస్తున్న మట్టి ప్రాంతాలుతాబేళ్ల గూళ్లుహార్ష్ షూ పీతల పరిరక్షణనిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది.

  7. సముద్రంలోని పెద్ద జీవులువాటి ఆవాసాలతో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకురాష్ట్రాలుకేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ పథకం ‘సముద్ర జీవుల ఆవాసాల అభివృద్ధి’ ద్వారా మంత్రిత్వ శాఖ నిధులు అందిస్తుందివివరాలు అనుబంధం - 1లో ఉన్నాయి.

  8. ప్రవాళాలుమడ అడవుల సంరక్షణకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేస్తుంది.

  9. నేషనల్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్అండ్ ప్లానింగ్ అథారిటీ ద్వారా సముద్ర ఆవులను (డ్యుగోంగ్), వాటి ఆవాసాల రక్షణకు మంత్రిత్వశాఖ నిధులు కేటాయిస్తుంది.

 

అనుబంధం-I

గడచిన అయిదేళ్లలో సీఎస్ఎస్ - ‘వన్యప్రాణుల ఆవాసాల అభివృద్ధి’ నిమిత్తం తీరప్రాంత రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేసిన నిధుల వివరాలు(రూ. లక్షల్లో)

క్రమ సంఖ్య

రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం పేరు

2019-20

2020-21

2021-22

2022-23

2023-24

1

అండమాన్ నికోబార్ దీవులు

132.64

0

135.77

25.125

0

2

ఆంధ్రప్రదేశ్

0

0

0

0

0

3

గోవా

111.654

0

0

0

50.10

4

గుజరాత్

0

124.5849

0

200.01

206.99

5

కర్ణాటక

739.046

586.12634

1256.59314

291.71146

581.52346

6

కేరళ

845.026

731.2845

295.7737

224.4735

921.0361

7

మహారాష్ట్ర

715.781

146.08

0

350.3879

554.69645

8

ఒడిశా

701.504

697.50

726.80273

967.4976

612.81161

9

తమిళనాడు

409.505

334.0354

390.75715

132.95205

373.8902

10

పశ్చిమబెంగాల్

891.073

710.61953

757.25599

201.30866

385.29988

11

పుదుచ్చేరి

0

0

0

0

5.22

12

లక్ష ద్వీప్

193.272

462.409

462.086

269.9055

124.655

 

మొత్తం

4739.501

3792.64

4025.039

2663.372

3816.223

ఈ అంశంపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణంఅటవీవాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ కీర్తి వర్ధన్ సింగ్ ఈ రోజు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

 

 

***


(Release ID: 2079984) Visitor Counter : 78


Read this release in: English , Urdu , Hindi , Tamil