సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వామ్! ఢిల్లీలో మెరిసిన మాంగా, యానిమీ, వెబ్ టూన్‌ ప్రతిభ: కాస్‌ప్లే, వాయిస్ యాక్టింగ్ ప్రదర్శించిన కళాకారులు


మాంగా, యానిమీలో మీ అభిరుచిని మరింత పెంచుకునే అవకాశం: వామ్ లో చేరండి విజేతలుగా నిలవండి

Posted On: 01 DEC 2024 3:02PM by PIB Hyderabad

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వ సహకారంతో మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ) వామ్! (వేవ్స్ యానిమీ అండ్ మాంగా పోటీలు) ను విజయవంతంగా నిర్వహించింది. నవంబర్ 30న ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్‌ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.  తాజాగా జరిగిన వామ్! భారత్‌లోని మాంగా, యానిమీ, వెబ్‌టూన్ సృష్టికర్తల సృజనాత్మక సామర్థ్యాన్ని ప్రదర్శించింది. ఉత్సాహవంతులైన ప్రేక్షకులను అలరించింది.  

గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, వారణాసిలో సాధించిన విజయం ఆధారంగా ఢిల్లీలో జరిగిన వామ్!లో మాంగా (జపనీస్ శైలి కామిక్స్), వెబ్ టూన్ (డిజిటల్ కామిక్స్), యానిమీ (జపనీస్ శైలి యానిమేషన్) తదితర విభాగాల్లో 199 మంది పాల్గొన్నారు. అందరూ మెచ్చే యానిమీ, గేమింగ్ పాత్రలకు జీవం పోసే 28 మంది కాస్‌ప్లే, వాయిస్ యాక్టింగ్ కళాకారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వియత్నాం నటి, దర్శకురాలు, నిర్మాత మై తూ హుయెన్,  అమెరికన్-వియత్నామీస్ నిర్మాత, నటి జాక్వెలిన్ తావో న్యూయెన్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీ సుశీల్ కుమార్ భాసిన్, ఉపాధ్యక్షుడు శ్రీ కమల్ పహుజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మై తు హుయెన్ మాట్లాడుతూ నూతనంగా వెలుగులోకి వస్తున్న భారతీయ ప్రతిభను ప్రశంసించారు. అలాగే త్వరలో విడుదల కాబోతున్న తన సినిమా ఎ ప్రాజైల్ ప్లవర్ గురించి వివరాలను ఉత్సాహంగా పంచుకున్నారు. ఈ సినిమాను స్థిరత్వం, స్వీయ ఆవిష్కరణలను ప్రదర్శించే శక్తిమంతమైన కథని, లోతైన భావోద్వేగాలతో, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో నిండి ఉంటుందని వివరించారు.

కాస్‌ప్లే, వాయిస్ యాక్టింగ్ పోటీలు

ఈ రోజు జరిగిన కార్యక్రమాల్లో కాస్‌ప్లే పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. దీనిలో పాల్గొన్నవారు సృజనాత్మకంగా, తాము  మెచ్చే యానిమీ, గేమింగ్ పాత్రల యథాతథ వేషధారణలో అలరించారు. వాయిస్ యాక్టింగ్ పోటీల్లో నైపుణ్యం కలిగిన 14 మంది పోటీదారులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం భారత దేశంలో పెరుగుతున్న కళల నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

ఈ కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని జోడిస్తూ, వైభవీ స్టూడియోస్ అభివృద్ధి  చేస్తున్న భారతదేశ మొట్టమొదటి యానిమీ ట్రయో స్నీక్ పీక్‌ను ప్రదర్శించారు. ఇది ప్రేక్షకుల్లో స్ఫూర్తిని కలిగించింది. ఆశ్చర్యాన్ని రేకెత్తించింది.

విజేతలకు బీసీ - I, II, III, ఎన్ఎంసీ పీఎ నుంచి ఓఎస్‌డీ (బీసీ) వరకు బాధ్యత వహిస్తున్న ఓఎస్‌డీ (బీసీ) శ్రీ అనుభవ్ సింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్  కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గుర్మీత్ సింగ్ బహుమతులు అందించారు. గెలుపొందినవారి విజయానికి గుర్తింపుగా వాకామ్ నుంచి నగదు బహుమతులు, పెన్ టాబ్లెట్లు, ఫాబెర్ క్యాసెల్ నుంచి హ్యాంపర్స్, ట్రయో అధికారిక ఉత్పత్తులను అందుకున్నారు.

వామ్! అంటే పోటీలు మాత్రమే కాదు, అంతకు మించినది. ఇది భారత సృజనాత్మక మేధను  ప్రోత్సహించే, శక్తిమంతం చేసే ఒక ఉద్యమం. ప్రతిభను, మేధో సంపత్తి సృష్టిని ప్రోత్సహించడం ద్వారా మాంగా, యానిమీ, వెబ్‌టూన్లకు భారత్‌ను గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడమే మన లక్ష్యం. డిల్లీలో ప్రదర్శించిన ఉత్సాహం, ఆవిష్కరణలు భారతదేశ క్రియేటర్ ఎకానమీకి ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనం.

 

ఢిల్లీ వామ్!లో విజేతలు

విభాగం

స్థానం

విజేత

నగదు బహుమతి (రూపాయల్లో)

కాస్‌ప్లే

 

విజేత

విష్

5000

రెండోస్థానం

ధ్రువ్ తులి

3000

వాయిస్ యాక్టింగ్

విజేత

రేషమ్ తల్వార్

5000

రెండో స్థానం

దీపక్ సైని

3000

మూడో స్థానం

యాజిన్ వాదేరా

2000

మాంగా

విద్యార్థి విభాగం

హర్షిక

నిపుణుల విభాగం

రోహన్ దాస్

వెబ్ టూన్

విద్యార్థి విభాగం

నిషాంత్ దేశ్వాల్

 
 

ప్రధానస్రవంతిలో మొట్ట మొదటి దృష్టి లోపం ఉన్న వాయిస్ యాక్టర్‌గా గుర్తింపు సాధించిన రేషమ్ తల్వార్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

వామ్! గురించి

వేవ్స్ (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ - https://wavesindia.org) లో వామ్! ఒక భాగం. ఇది యానిమేషన్, గేమింగ్, మాంగా రంగాల్లో భారత్‌ను ముందంజలో ఉండేలా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉంది. ప్రతి నగరంలోనూ క్రియేటర్లలో స్ఫూర్తి నింపుతుంది. ఆవిష్కరణలను, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే శక్తిమంతమైన కళారూపాలను ప్రోత్సహిస్తుంది.


 

*****


(Release ID: 2079605) Visitor Counter : 43