సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav
iffi banner

నటుడు శ్రీ విక్రాంత్ మేసీకి ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటి ఆఫ్ ద ఇయర్’ పురస్కారం;

ఐఎఫ్ఎఫ్ఐ 2024లో ప్రదానం

నేను స్వతహాగా కథకుడిని, సామాన్యుల వాణిని వినిపించేందుకు అవకాశాలిచ్చే స్క్రిప్టులనే ఎంచుకొంటాను: విక్రాంత్ మేసీ

ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటి ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని గోవాలో నిర్వహించిన 55వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు కార్యక్రమంలో నటుడు శ్రీ విక్రాంత్ మేసీకి అందజేశారు. భారతీయ చలనచిత్ర రంగానికి శ్రీ విక్రాంత్ మేసీ అందజేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును గోవా ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ జాజు.. వీరు ఇరువురూ కలిసి ప్రదానం చేశారు.

 

ఈ సమ్మానాన్ని స్వీకరించే సందర్భంగా శ్రీ విక్రాంత్ మేసీ భావోద్వేగభరితుడయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఇంతవరకు తాను సాగించిన ప్రయాణాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘ఇది నాకు నిజంగా ఒక ప్రత్యేకమైన క్షణం. ఇంతటి గౌరవాన్ని అందుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. జీవితంలో మిట్ట పల్లాలు ఉండనే ఉంటాయి. అయితే, ‘ట్వల్త్ ఫెయిల్’ చిత్రంలో నేను పోషించిన పాత్ర మాదిరిగానే మనం ఏదో ఒకచోట ఆగిపోయినప్పటికీ మన ప్రయాణాన్ని మళ్లీ మొదలుపెట్టడానికి ఎల్ల వేళలా సిద్ధంగా ఉండాల’’న్నారు.

 

 

 

ఆయన ఇంకా ఇలా మాట్టాడారు.. ‘‘నేను స్వతహాగా ఒక కథకుడిని. సామాన్యుల అభిప్రాయాలకు అద్దం పడతాయనుకున్న స్క్రిప్టులనే నేను ఎంపిక చేసుకొంటూ ఉంటాను. మీరు ఏ నేపథ్యం నుంచి వచ్చిన వారయినా గానీ మిమ్మల్ని మీరు ఒప్పుకొంటూ, మీ కథలకు, మీ మూలాలకు అంటిపెట్టుకొని ఉండండి. భారతీయ చలనచిత్ర పరిశ్రమ అందులో భాగం పంచుకోవడానికి అత్యంత ప్రత్యేకం అయినటువంటి పరిశ్రమల్లో ఒక పరిశ్రమ.’’

 

 

 

ఎవరైనా ఒక మనిషిని ఒక పట్టాన నమ్మడానికి వీలుండనంత ఉన్నత స్థాయిలకు చేరవేయగలిగేది ఆ వ్యక్తి కనే కలలూ, ఆ వ్యక్తి లోనయ్యే సంఘర్షణలూను అనేందుకు శ్రీ విక్రాంత్ మేసీ జీవన గమనమే ఒక విశేష నిదర్శనం. ఆయన తన ముందున్న కాలాన్ని గురించి ఎంతో ఉత్తేజంతో మాట్లాడుతూ, ‘‘నా నటన ప్రతిభలో ఇంతవరకు బయటపడని కోణాలు అనేకం ఉన్నాయి. దయచేసి వేచి ఉండి, ఆ కోణాలను పరిశీలించండ’’న్నారు.

ఎవరైనా ఒక మనిషిని ఒక పట్టాన నమ్మడానికి వీలుండనంత ఉన్నత స్థాయిలకు చేరవేయగలిగేది ఆ వ్యక్తి కనే కలలూ, ఆ వ్యక్తి లోనయ్యే సంఘర్షణలూను అనేందుకు శ్రీ విక్రాంత్ మేసీ జీవన గమనమే ఒక విశేష నిదర్శనం. ఆయన తన ముందున్న కాలాన్ని గురించి ఎంతో ఉత్తేజంతో మాట్లాడుతూ, ‘‘నా నటన ప్రతిభలో ఇంతవరకు బయటపడని కోణాలు అనేకం ఉన్నాయి. దయచేసి వేచి ఉండి, ఆ కోణాలను పరిశీలించండ’’న్నారు.

 

విక్రాంత్ మేసీ ప్రభావవంతమైన చలనచిత్రాల్లో ‘దిల్ ధడక్‌నే దో’ (2015), ‘ఎ డెత్ ఇన్ ద గంజ్’ (2016) ‘లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా’ (2016), ‘హాఫ్ గాల్‌ఫ్రెండ్’ (2017), ‘డాలీ కిట్టీ ఔర్ వో చమక్‌తే సితారేఁ’ (2019) ‘గిన్నీ వెడ్స్ సనీ (2020) లతోపాటు సైన్స్ ఫిక్షన్ రత్నం ‘‘కార్గో’’ (2020) వంటివి ఉన్నాయి. ఈ చిత్రాల్లో ప్రతి ఒక్కటీ ఆయన బహుముఖ ప్రతిభను, సినిమా కళ అంటే ఆయనకున్న అంకితభావాన్ని చాటిచెప్పాయి. ఈ కారణంగానే ఇటు ప్రేక్షకులతో పాటు అటు విమర్శకుల ప్రశంసలు కూడా ఆయనకు లభించాయి.

 

మనసును ఆకట్టుకొనే నమ్మదగ్గ పాత్ర పోషణల ద్వారాను, తెర మీద కనిపించే పాత్రతో ప్రేక్షకులు మమేకమైపోయే దక్షతను కనబరచడం ద్వారాను ఈ నటుడి నేర్పరితనం సినిమా రంగంలో సామాన్యుడికి నిజమైన ప్రతినిధి అంటే ఇతనేనన్న ఖ్యాతిని తెచ్చిపెట్టింది. నటనలో కొత్త పార్శ్వాలను ఆవిష్కరించాలని విక్రాంత్ మేసీ తపించిపోతున్న క్రమంలో, ఆయన పోషించనున్న మరిన్ని పాత్రలు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చెరిగిపోనటువంటి ముద్రను వేస్తాయన్న ఆశను రేకెత్తిస్తున్నాయి.

 

**

 

iffi reel

(Release ID: 2079294) Visitor Counter : 50