ప్రధాన మంత్రి కార్యాలయం
గ్రెనడా ప్రధానమంత్రితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
21 NOV 2024 10:44PM by PIB Hyderabad
గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండో శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో, నవంబర్ 20వ తేదీన గ్రెనడా ప్రధానమంత్రి శ్రీ డికన్ మిచెల్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
కరికామ్ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి, సదస్సులో చర్చలు అర్థవంతంగా జరిగేందుకు దిశానిర్దేశం చేసిన శ్రీ మిచెల్ కు శ్రీ మోదీ అభినందనలు తెలియజేశారు.
ఇరువురి నేతల మధ్య జరిగిన చర్చల సందర్భంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్యరక్షణ, సామర్థ్య పెంపు, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యూహాల వంటి రంగాల్లో సహకారాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తమ దేశానికి టీకాలను పంపిణీ చేసినందుకు శ్రీ మిచెల్ శ్రీ మోదీకి కృత్జ్ఞతలు తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు భారత్ నేతృత్వం వహిస్తున్నందుకు శ్రీ మిచెల్ హర్షం వ్యక్తం చేశారు.
(रिलीज़ आईडी: 2076204)
आगंतुक पटल : 53
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam