ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచంపై భారతీయ సంస్కృతి ప్రభావం... ప్రశంసనీయం: ప్రధానమంత్రి శ్రీ జోనస్ మసెటీని, ఆయన జట్టును కలుసుకొన్న ప్రధానమంత్రి


గీత, వేదాంతాలపై శ్రీ మసెటీకి ఉన్న మక్కువ హర్షణీయమన్న ప్రధానమంత్రి

Posted On: 20 NOV 2024 7:54AM by PIB Hyderabad

ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంస్కృతి ప్రభావాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారు. గీత పట్ల, వేదాంతం పట్ల మక్కువను పెంచుకొన్న శ్రీ జోనస్ మసెటీని ప్రధాని అభినందించారు. శ్రీ జోనస్ మసెటీ బృందం రామాయణంపై ఒక ప్రదర్శనను సంస్కృత భాషలో సమర్పించగా, ఆ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి తిలకించారు. అనంతరం కళాకారులతో సమావేశమయ్యారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘శ్రీ జోనస్ మసెటీని, ఆయన జట్టు సభ్యులను కలుసుకొన్నాను. వేదాంతం అంటేనూ, గీత అంటేనూ ఆయనకు ఎంత అభిమానం ఉందో అనే విషయాన్ని #MannKiBaat (‘మన్ కీ బాత్’ ..మనసులో మాట) కార్యక్రమాల పరంపరలోని ఒక కార్యక్రమంలో నేను ఇప్పటికే ప్రస్తావించి ఉన్నాను. రామాయణం సన్నివేశాలను కొన్నింటిని ఆయన బృందం సంస్కృత భాషలో సమర్పించింది. ప్రపంచ దేశాల్లో భారతీయ సంస్కృతి ప్రభావం ప్రశంసనీయం’’.

 

 

***

MJPS/SR


(Release ID: 2074948) Visitor Counter : 9