ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఝాన్సీ వైద్య కళాశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిన్నారులు మరణించడంతో ప్రధానమంత్రి సంతాపం


పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్-గ్రేషియాను ప్రకటించిన ప్రధానమంత్రి

Posted On: 16 NOV 2024 8:23AM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైద్య కళాశాలలో ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలనా యంత్రాంగం బాధితులకు చేతనైన ప్రతి ఒక్క సహాయాన్ని అందించడంలో నిమగ్నం అయిందని ఆయన హామీనిచ్చారు.

ఎక్స్ లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘హృదయవిదారకం! ఉత్తరప్రదేశ్ లో ఝాన్సీలో మెడికల్ కాలేజీలో మంటలు చెలరేగడంతో జరిగిన దుర్ఘటన బాధాకరం. ఏ పాపం ఎరుగని తమ చిన్నారులను ఈ అగ్నిప్రమాదం కారణంగా కోల్పోయిన వ్యక్తులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ అంతులేని దు:ఖాన్ని వారు ఓర్చుకొనే శక్తిని వారికి ఇవ్వాల్సిందిగా ఆ పరమాత్మను నేను ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక పాలనా యంత్రాంగం సహాయక, ఉపశమన చర్యలను చేపట్టడంలో చేతనైన అన్ని  ప్రయత్నాలను చేయడంలో నిమగ్నమైంది: పీఎమ్@narendramodi"

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ వైద్య కళాశాలలో సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మీయులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎమ్ఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్-గ్రేషియాను కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.  ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇస్తారని ఆయన తెలిపారు.



సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ఎక్స్ లో ప్రధానమంత్రి కార్యాలయం (పీఎమ్ఓ) ఈ కింది విధంగా పేర్కొంది:

‘‘ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో అగ్నిప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మీయులకు పీఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షల వంతున ఎక్స్-గ్రేషియాను ప్రధాన మంత్రి @narendramodi ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఇస్తారు.’’

 

 

***

MJPS/SR


(Release ID: 2074131) Visitor Counter : 11