సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 5

ఇఫీ-2024 రజత మయూరాన్ని చేజిక్కించుకునేందుకు ఇద్దరు భారతీయ, ఐదుగురు అంతర్జాతీయ తొలి దర్శకుల పోటీ


తాజా గొంతుకలు, తెగింపుతో కూడిన ఇతివృత్తాలు : 55వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో ఎగిసిపడుతున్న కొత్తనీరు

 55వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవం (ఇఫీ)తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రాణించిన దర్శకుల ప్రతిభకు పట్టం కట్టనుంది. ఉత్తమ దర్శకుడి అవార్డు కోసం ఎంపిక చేసిన ఐదుగురు  అంతర్జాతీయఇద్దరు భారతీయ దర్శకుల తొలి చిత్రాలను ప్రదర్శిస్తుంది. విజేతకు ప్రతిష్టాత్మకమైన రజత మయూరం, 10 లక్షల రూపాయల నగదు బహుమతి,  ప్రశంసాపత్రాన్ని  బహూకరిస్తారు.

మన మేటి దర్శకుడు అశుతోష్ గోవారికర్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ప్రత్యేక జ్యూరీ విజేతను ఎంపిక చేస్తుంది.  జ్యూరిలో సింగపూర్ దర్శకుడుస్క్రీన్ రైటర్ ఆంథోనీ చెన్అమెరికన్-బ్రిటీష్ చిత్ర నిర్మాత ఎలిజబెత్ కార్ల్‌సెన్స్పానిష్ నిర్మాత ఫ్రాన్ బోర్జియాఆస్ట్రేలియా ఎడిటర్ జిల్ బిల్‌కాక్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు ఇతర సభ్యులుగా ఉన్నారు.

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మొదటిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన ప్రతిభావంతుల సినిమాలను గుర్తిస్తూనవశకం దర్శకులు తమ ఊహలను తెరకెక్కించే విధానానికి ఈ ఎంపిక అద్దం పడుతోంది.

పురస్కారం కోసం జ్యూరీ ఎంపిక చేసిన చిత్రాల జాబితా:

 

1.            బెటానియా

దర్శకత్వం: మార్సెలో బొత్తా

బ్రెజిల్ దర్శకుడుకథకుడు మార్సెలో బొత్తా తొలిసారి దర్శకత్వం చేపట్టిన చిత్రం బెటానియా. ఈ చిత్రాన్ని తొలిసారిగా 2024 బెర్లిన్ అంతర్జాతీయ చలచిత్రోత్సవంలో ప్రదర్శించారు.

పర్యావరణంసామాజిక సహజీవనంభిన్న మనస్తత్వాల మనుషులు  వంటి బరువైన అంశాల చిత్రీకరణ ద్వారా బ్రెజిల్ వారసత్వపు చరిత్రకు జోతలు పట్టిన చిత్రమిది. ఇసుక కొండల మధ్య విసిరివేయబడినట్టున్న  తన ఊరికి కరెంటు తెప్పించేందుకు పోరాటం సాగించిన సామాజిక యోధురాలు మరియా దో సెల్సో జీవితం నుంచి స్ఫూర్తి పొందిన కథ.

2.            బౌండ్ ఇన్ హెవెన్

దర్శకత్వం : హువో జిన్ 

చైనా చిత్ర పరిశ్రమలో పేరొందిన మాటల రచయిత్రి  హువో జిన్ తొలిసారిగా దర్శకత్వం చేపట్టిన చిత్రం బౌండ్ ఇన్ హెవెన్2024 శాన్ సెబాస్టియన్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ ఛాయాగ్రహణం, ‘ఫిప్రేసీ’ (విమర్శకులు) జ్యూరీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న చిత్రం. హింసమరణంస్నేహం నేపథ్యంలో ప్రేమ-నేరాలను ప్రత్యేక శైలిలో చిత్రాకరించారు దర్శకురాలు. హింస వల్ల బందీగా ఉన్న మహిళప్రాణాంతక వ్యాధి పీడితుడైన పురుషుడుఅనుకోని పరిస్థితుల్లో కలుసుకుని విడదీయలేని అనుబంధంతో కట్టుబడ్డ రెండు ఒంటరి పక్షుల జీవితాల గురించిన కథ.

3.            బ్రింగ్ దెమ్ డౌన్

దర్శకత్వం : క్రిస్టఫర్ ఆండ్రూ

బ్రిటిష్ స్క్రీన్ రైటర్దర్శకుడు క్రిస్టోఫర్ ఆండ్రూస్ తొలి చలనచిత్రం గ్రామీణ ఐర్లాండ్‌ నేపథ్యంగా తీసిన  థ్రిల్లర్-డ్రామా. బారీ కియోఘన్క్రిస్టోఫర్ అబాట్పాల్ రీడీకోల్మ్ మీనీ నటించిన ఈ చిత్రం టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది.

అంతర్గత కలహాలుకుటుంబంలో శత్రుత్వంపక్క రైతుతో పోటీ వంటి అనేక అంశాల్లో  సంఘర్షణను ఎదుర్కొంటున్న  ఐరిష్ దేశపు  గొర్రెల కాపరి కుటుంబం చుట్టూ తిరిగే కథ బ్రింగ్ దెమ్ డౌన్ . ఆధిపత్య పితృస్వామ్యం,  వారసత్వంతరాల మధ్య అంతరాలు వంటి అంశాలని ఐర్లాండ్ దేశపు సాంస్కృతిక దృష్టికోణం ద్వారా చూపిన చిత్రం.

4.            ఫెమిలియర్ టచ్

దర్శకత్వం : సారా ఫ్రెయిడ్ ల్యాండ్

అమెరికన్ ఫిల్మ్ మేకర్స్క్రీన్ రైటర్కొరియోగ్రాఫర్ సారా ఫ్రైడ్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఫెమిలియర్ టచ్,  వెనిస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ తొలి చిత్రానికి ఇచ్చే ‘లుయిగి డి లారెన్టిస్’ అవార్డుఉత్తమ నటిఉత్తమ దర్శకులకు అందించే ‘వెనిస్ హొరైజన్స్’ అవార్డుల వంటి అనేక పురస్కారాలను  గెలుచుకుంది.

వృద్ధాప్యాన్ని సానుభూతితో పరిశీలించిన సినిమా ఫెమిలియర్ టచ్. జ్ఞాపకశక్తిని కోల్పోతున్న 80 ఏళ్ల వృద్ధురాలు తనని తానే గుర్తించలేని పరిస్థితికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆమెలోని కోరికలుసంరక్షకులతోనే కాక  తనతో తానే పడే ఘర్షణను అద్వితీయంగా చూపిన చిత్రమిది.

 

5.            టు ఎ ల్యాండ్ అన్నోన్

దర్శకత్వం : మహ్దీ ఫ్లీఫెల్

సామాజిక న్యాయంశరణార్థుల ఇతివృత్తాలను పరిశీలించడంలో దిట్టగా పేరుబడ్డ తొలిసారి దర్శకుడువిజువల్ ఆర్టిస్ట్ మహదీ ఫ్లీఫెల్ చేతిలో రూపుదిద్దుకున్న టు ఎ ల్యాండ్ అన్నోన్, 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలి ప్రదర్శనకు నోచుకుంది.

మెరుగైన జీవితం కోసం తపించే ఇద్దరు రక్త సంబంధీకుల జీవితాల్లోకి తొంగి చూసే టు ఎ ల్యాండ్ అన్నోన్థ్రిల్లర్ డ్రామా కోవలోకి వస్తుంది.

6.            జిప్సీ

దర్శకత్వం : శశి చంద్రకాంత్ ఖండారే

జిప్సీ సినిమా మరాఠీ దర్శకుడు శశి చంద్రకాంత్ ఖండారే తొలి ప్రయత్నం.     

అలవాటైన ప్రాంతం నుంచి స్థానభ్రంశంకొరత,  ఆకలి ఇతివృత్తాలను మనసులకు హత్తుకునేలా చెప్పిన కథ. ఒక సంచార జాతి కుటుంబం వేర్వేరు ప్రాంతాలు తిరుగుతూ రోజులు గడుపుతూ ఉంటుంది.  నిలకడ లేకుండా తిరుగుతూ ఉండవలసిన పరిస్థితుల్లో విశ్రాంతి కరువైన గర్భిణి తల్లి  ఒకవైపు ఇబ్బందులు పడుతూ ఉంటేఅడుక్కున్న ఇళ్ళ నుంచీ దొరికిన చద్ది కూడు తినలేక చిన్న వాడు  'జోత్య'  కష్టపడుతూ ఉంటాడు . ఒకరోజు వేడి వేడి అన్నం వాసన వాడి ముక్కుపుటాలనీ, ఆత్మనీ కదిలించి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.  అదే వాసన  వాడి  జీవితాన్ని మార్చే అవకాశాన్ని కలిగించినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.

7.            35 చిన్న కథ కాదు

దర్శకత్వం : ఈమని వీ ఎస్ నందకిషోర్

తెలుగు కాల్పనిక రచయితదర్శకుడు ఈమని వీ ఎస్ నందకిశోర్ తొలి సారి దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకున్న చలనచిత్రం - 35 చిన్న కథ కాదు.  

తిరుపతి పుణ్యక్షేత్రంలో గుడికి దగ్గరగా ఒక  చిన్న ఇంట్లో బస్ కండక్టర్ గా పని చేస్తున్న భర్త ప్రసాద్ఇద్దరి కొడుకులతో జీవనం సాగిస్తూ ఉంటుంది  28 ఏళ్ళ ఇల్లాలు సరస్వతి. మనసుపడ్డ ప్రసాద్ ను మనువాడేందుకే మొగ్గు చూపిన 16 ఏళ్ళ సరస్వతి చదువుకి తిలోదకాలు ఇచ్చేస్తుంది. ఐతే పదేళ్ళ కొడుకు అరుణ్ లెక్కల్లో ఇబ్బంది పడుతున్నప్పుడు చదువు విలువ తెలుసుకుంటుంది ఆమె. కొడుక్కి ఎట్లాగైనా సహాయపడాలని గణితం నేర్చుకోవడం మొదలుపెడుతుంది సరస్వతి. ఇబ్బందులని దాటడంలో పట్టుదలకుటుంబ అనుబంధాలువారి జీవితంలో ఇరుగుపొరుగుల ప్రమేయాన్ని సినిమా అందంగా చూపింది.

తాజా స్వరాలుకొత్త దృక్కోణాలువెరుపు చూపని దృక్పథాలతోతొలి దర్శకులు ప్రత్యేకంగా ఇఫీ ప్రతినిధులు  వినితీరవలసిన కథలను అందిస్తున్నారు. 55వ ఇఫీలో వర్ధమాన ప్రతిభావంతుల చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. 

“ఈ వర్ధమాన దర్శకుల  ప్రతిభను ఆస్వాదించేందుకు మీకిదే ఆహ్వానం పలుకుతున్నాం..  అవధులు లేని సినిమా శక్తిని కలిసి వేడుక చేసుకుందాం రండి...”

55వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం గోవా రాష్ట్రం పనాజీ వేదికగా ఈ నెల 20 నుంచి 28 వరకూ జరగనుంది.

 

 

***

iffi reel

(Release ID: 2073993) Visitor Counter : 20