సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ఇఫీ 2024 గోల్డెన్ పీకాక్ కోసం.... 15 సినిమాలు
ప్రతిష్ఠాత్మక అవార్డు కోసం పోటీలో మూడు భారతీయ సినిమాలు
జార్జియా- అమెరికన్ దర్శకుడు జార్జ్ సిఖారులిడ్జ్ తొలి ప్రయత్నం- పానోప్టికాన్. జార్జియాకి చెందిన యువకుడు తన జీవితంలో వ్యక్తిత్వం, నైతికతలకు సంబంధించి మానసికంగా ఎదుర్కొన్న ప్రశ్నల గురించిన చిత్రమిది. కార్లోవీ వారీ చిత్రోత్సవంలో జ్యూరీ అవార్డు గెలుచుకుంది. ఇది కూడా కమింగ్ ఆఫ్ ఏజ్ స్టోరీ కావడం విశేషం. సోవియట్ ఆనంతర సమకాలీన కాలంలో జార్జియా సమాజంలో యుక్త వయసు వాళ్లు ఎదుర్కొనే సమస్యలు దీని నేపథ్యం.
6. పియర్స్ (సింగపూర్)
జాతీయ అవార్డు గ్రహీత ఆదిత్య సుహాస్ జంభాలే ఈ సినిమాకి దర్శకుడు. రాజ్యాంగంలో జరిగే మార్పు నేపథ్యంలో జరిగే పొలిటికల్ థ్రిల్లర్ ఆర్టికల్ 370.
జమ్మూకాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టిన ఆర్టికల్ 370 పర్యవసానాలను ఈ సినిమా లోతుగా చర్చించింది. ఆ ప్రాంతంలోని సామాజిక రాజకీయ వాతావరణాన్ని చాలా గొప్పగా చూపించిన చిత్రం. వ్యక్తిగత త్యాగం, అధికార పోరు నేపథ్యంలో ఆర్టికల్ 370 సినిమాని దర్శకుడు అద్భుతంగా చూపించగలిగాడు.
15. రావ్ సాహెబ్ (భారత్)
జాతీయ అవార్డు గ్రహీత నిఖిల్ మహాజన్ నుంచి వచ్చిన మరాఠీ క్రైమ్ థ్రిల్లర్- రావ్ సాహెబ్. ఇఫీ వరల్డ్ ప్రీమియర్ కేటగిరీలో ప్రదర్శితం కానున్నది. గిరిజన ప్రాంతంలో మనిషికీ జంతువుకీ మధ్య సంఘర్షణ... న్యాయం కోసం జరిగే పోరాటం.. ఇదీ రావ్ సాహెబ్ నేపథ్యం. ఇండియాలోని గిరిజన ప్రాంతపు కథా వస్తువుతో ఈ సినిమా ఉత్కంఠతో సాగుతుంది.
సినిమాలో...మహిళలకు పెద్దపీట
ఈ ఏడాది వచ్చిన నామినేషన్లు 15 సినిమాల్లో 9 సినిమాలకు మహిళా దర్శకులే ఉన్నారు. అందరూ నైపుణ్యం కలిగినవారు కూడా.
డేట్ గుర్తుపెట్టుకున్నారా?
మీరు ఏ సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు?
మీకు ఇందులో ఇంకా ఏదీ ఎంపిక చేసుకోలేదా?
ఈ నవంబరులోనే... ఇఫీకి వచ్చేసి మమ్మల్ని కలవండి. గొప్ప గొప్ప సినిమాలు చూసే అవకాశాన్ని కోల్పోవద్దు. మరి ఈ సినిమాలన్నీ... గోల్డెన్ పీకాక్ కోసం పోటీపడుతున్నాయి కదా...
పనాజీ (గోవా)లో నవంబరు 20 నుంచి 28 వరకూ 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఆశ్చర్యపోవడానికీ, స్ఫూర్తి పొందడానికీ, వినోదించడానికీ... గెట్ రెడీ.
* * *
(Release ID: 2073179)
Visitor Counter : 29