పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న న్యూ ఢిల్లీలో ఆర్థిక సంఘాల చర్చా వేదిక;
అధ్యక్షత వహించనున్న 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు
‘‘అభివృద్ధి ప్రధానంగా అధికారాల అప్పగింత’’ ఈ చర్చా వేదికలో ప్రధానాంశం;
గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థల(ఆర్ ఎల్బీస్)కు నిధుల కేటాయింపులో
రాష్ట్ర ఆర్థిక సంఘాల పాత్రను పెంచడమే ధ్యేయం
Posted On:
13 NOV 2024 1:38PM by PIB Hyderabad
పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ (ఎమ్ఓపీఆర్) ఈ నెల 14న న్యూ ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ‘‘ఫైనాన్స్ కమిషన్స్ కాన్‌క్లేవ్ - డివల్యూషన్ టు డెవలప్‌మెంట్’’ (ఆర్థిక సంఘాల చర్చావేదిక – అభివృద్ధి కోసం అధికారాల అప్పగింత) అంశంపై చర్చావేదికను నిర్వహించనుంది. పంచాయతీ రాజ్ సంస్థ (పీఆర్ఐ) లకు మరిన్ని అధికారాల అప్పగింతను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా ఈ చర్చా వేదికకు నాయకత్వం వహించనున్నారు. గ్రామీణ ప్రాంతాల స్థానిక సంస్థ (ఆర్ఎల్‌బీ)లకు నిధులను సమర్థంగా కేటాయించడంలో రాష్ట్ర ఆర్థిక సంఘాల (ఎస్ఎఫ్‌సీల) పాత్రను ఇప్పటి కన్నా పెంచాలన్నది దీని ఉద్దేశం. ఈ చర్చావేదిక ఆసక్తిదారుల (స్టేక్ హోల్డర్స్)ను ఒక చోటుకు తీసుకు రానుంది. స్థానిక పరిపాలనలో, ఆర్థిక అధికారాల అప్పగింతలో ప్రమేయం ఉన్న వివిధ ఆసక్తిదారుల మధ్య చర్చలను, సమన్వయాన్ని పెంచడం ఈ కాన్‌క్లేవ్ ధ్యేయం. ఈ కార్యక్రమంలో 16వ ఆర్థిక సంఘం సభ్యులు, పంచాయతీ రాజ్ శాఖ, ఆర్థిక శాఖ, గృహ నిర్మాణం- పట్టణ వ్యవహారాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, నిపుణులు, తొమ్మిది రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర ఆర్థిక సంఘాల చైర్ పర్సన్‌లు పాల్గొంటారు. ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఉతరప్రదేశ్.. ఉన్నాయి. కార్యక్రమంలో పాల్గొనే వారు ఎస్ఎఫ్‌సీల పనితీరుపై తమ తమ అనుభవాలను, లోతైన అవగాహనను ఇప్పటికీ రాష్ట్ర ఆర్థిక సంఘాలను (ఎస్ఎఫ్‌సీ లను) ఏర్పాటు చేయని రాష్ట్రాల ఆర్థిక విభాగాలతో పంచుకొనేందుకు అవకాశం ఉంది.
కీలక కార్యక్రమాలు, చర్చలు:
స్థానిక సంస్థలలో ఆర్థిక అంశాల అజమాయిషీని పటిష్టపరచడం, మరీ ముఖ్యంగా ఎస్ఎఫ్‌సీ లను సమర్థంగా నిర్వహించడం ముఖ్యమని చాటిచెబుతూ, ఈ చర్చావేదికలో నాలుగు కీలక కార్యక్రమాలు ఉండబోతున్నాయి:
ప్రారంభ కార్యక్రమం: దీనిలో పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శులు, పట్టణ- గృహ నిర్మాణ వ్యవహారాల శాఖకు చెందిన కార్యదర్శులే కాక 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు డాక్టర్ అరవింద్ పనగారియా కూడా కీలకోపన్యాసాన్ని ఇవ్వనున్నారు. పంచాయతీ రాజ్ శాఖ జేఎస్ కూడా తన ఆలోచనలను వెల్లడిస్తారు.
కార్యక్రమం I : స్థానిక సంస్థ గ్రాంటులను గురించి – ఈ కార్యక్రమంలో టైడ్ గ్రాంటులు, అన్‌టైడ్ గ్రాంటులకు సంబంధించిన సవాళ్ళపైన, అవకాశాలపైన, ఆన్‌లైన్ మాధ్యమం అందుబాటుపైన, స్థానిక సంస్థల అకౌంట్ల ఆడిట్ పైన, ఇంకా గ్రాంటుల వినియోగానికి సంబంధించిన అంశాలపైన దృష్టి సారించనున్నారు.
కార్యక్రమం II: పంచాయతీల ఆర్థిక వనరులను గురించి – ఈ కార్యక్రమంలో భాగంగా, పంచాయతీలకు ఆదాయ మార్గాలను పెంచేందుకు అనుసరించదగ్గ వ్యూహాలతో పాటు నిధుల అందజేతపైన, విధులపైన చర్చించనున్నారు.
ముగింపు కార్యక్రమం – ఈ కార్యక్రమంలో వ్యయ విభాగ కార్యదర్శి ప్రసంగం, 16వ ఆర్థిక సంఘం అధ్యక్షుని ప్రసంగం ఉంటాయి.
చర్చావేదిక ముఖ్యోద్దేశాలు
రాష్ట్ర ఆర్థిక సంఘాల ముఖ్యావసరాలను గురించి ప్రధానంగా చర్చించి, వాటిని నెరవేర్చేందుకు గల అవకాశాలను ఈ చర్చావేదిక అందించనుంది. అట్టడుగు స్థాయిలో దీర్ఘకాలం పాటు అభివృద్ధికి తోడ్పడే ఒక బలమైన, మరింత ప్రతిస్పందనపూర్వక ప్రాథమిక కార్యాచరణ ప్రణాళికను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎస్ఎఫ్‌సీ సిఫారసులను సకాలంలో సిద్ధం చేసి, వాటిని సంబంధిత వర్గాల దృష్టికి నివేదించి అమలుపై దృష్టి సారించడాన్ని గురించి, నిధులను ప్రభావవంతమైన విధంగా కేటాయించడాన్ని ప్రోత్సహించడాన్ని గురించి, అట్టడుగు స్థాయిలో అభివృద్ధి సాధనకు ఆసక్తిదారులందరిలో సహకారాన్ని పెంచాలనే అంశాలపైన ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
***
(Release ID: 2073089)
Visitor Counter : 72