ప్రధాన మంత్రి కార్యాలయం
నా స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడాను: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
భారత్ – అమెరికా సంబంధాలను మరింత బలపరిచే దిశగా మళ్లీ కలసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను: ప్రధాని
Posted On:
06 NOV 2024 10:50PM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన శ్రీ డొనాల్డ్ ట్రంప్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. శ్రీ ట్రంప్ సాధించిన అద్భుత విజయానికి శ్రీ మోదీ అభినందనలు తెలిపారు. భారత్ - అమెరికా సంబంధాలు వివిధ రంగాల్లో మరింతగా బలపడేటట్లు శ్రీ ట్రంప్ తో మళ్లీ కలిసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
శ్రీ నరేంద్ర మోదీ ‘ఎక్స్’ లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘నా స్నేహితుడు, అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్ (@realDonaldTrump) తో మాట్లాడాను. ఎన్నికలలో ఆయన సాధించిన అఖండ విజయానికి గాను ఆయనను అభినందించాను. టెక్నాలజీ, రక్షణ, ఇంధనం, అంతరిక్ష రంగాలు సహా అనేక ఇతర రంగాలలో భారత్ - అమెరికా సంబంధాలను సుదృఢం చేసే దిశలో మళ్లీ ఇద్దరం కలిసి కృషి చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’
***
MJPS/SR
(Release ID: 2071700)
Visitor Counter : 35
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam