సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
iffi banner
0 2

ఐఎఫ్ఎఫ్ఐ 2024: వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్‌లో ప్రదర్శనకు ఆరు చలనచిత్రాలు


ఔత్సాహిక దర్శకులకు ఇఫీ ‘‘వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్’లో మార్గదర్శనం

ఈ సంవత్సరం ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ (ఇంటర్ నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా – ‘ఐఎఫ్ఎఫ్ఐ’)లో వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ లో ప్రదర్శించడానికి అధికారికంగా ఎంపిక చేసిన ఆరు అసాధారణ ఫిక్షన్ సినిమాల వివరాలను ఫిలిమ్ బజార్ ప్రకటించింది.

ఎంపికైన చలన చిత్రాలు ఇవీ..:

1.    త్రిబేణీ రాయ్ (నేపాలీ చిత్రంషేప్ ఆఫ్ మోమోస్

2.   శక్తీధర్ బీర్ (బెంగాలీ చిత్రంగాంగ్‌శాలిక్ (గాంగ్‌శాలిక్ రివర్ బర్డ్)

3.   మోహన్ కుమార్ వలసల (తెలుగు చిత్రంఎర్ర మందారం

4.   రిధమ్ జన్వే (గద్దీనేపాలీ చిత్రంకాట్టీ రీ రాట్టీ

5.   సిద్ధార్థ్ బాడీ (మరాఠీ చిత్రంఉమాల్

            6.   వివేక్ కుమార్ (హిందీ చిత్రంద గుడ్ద బ్యాడ్ద హంగ్రీ

వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ ఈ సంవత్సరం కూడా ఇటు ఆఫ్‌లైన్ సమావేశాలతో పాటుఅటు ఆన్‌లైన్ సమావేశాలను నిర్వహించనుందిఈ పద్ధతి దర్శకులుగురువులు వాస్తవ కాల ప్రాతిపదికన మేధోమథనం జరపడానికిపోస్ట్ప్రొడక్షన్  సంబంధిత అండదండలను ఏయే విధాలుగా అందుకోవచ్చో తెలుసుకొనే అవకాశాన్ని ఇస్తుంది.

ఎంపిక చేసిన ఆరు చలనచిత్రాలలో అయిదు చలన చిత్రాలు యువ దర్శకులవర్ధమాన దర్శకుల తొలి ప్రయత్నాలేఈ సినిమాలు వైవిధ్య భరిత చిత్ర కథాకథనాలను కళ్ళకు కట్టడం ఒక్కటే కాకుండా సంస్కృతిని లోతుగా పరిశీలించే దృష్టి కోణాల్లోని వైశిష్ట్యానికి కూడా అద్దం పడతాయిఇండియా ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ (ఐఎఫ్ఎఫ్ఐఈ నెలతో 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతోందిమరి ఇది తన శ్రద్ధను యువ చలనచిత్ర రూపకర్తలపై కేంద్రీకరిస్తూవారు కథను చెప్పే సరికొత్త పద్ధతులకు ప్రాచుర్యాన్ని కల్పిస్తోంది.

సృజనాత్మకతను పెంచి పోషించడానికి అండదండలను అందివ్వాలన్న ఐఎఫ్ఎఫ్ఐ నిబద్ధతను వర్స్-ఇన్-ప్రోగ్రెస్ (డబ్ల్యూఐపీవిభాగం ప్రతిబింబిస్తోందివర్తమాన జీవన సంక్లిష్టతలను నవతరం కళాకారులు తాము అవగాహన చేసుకున్న తీరులను భిన్న అభిరుచులు కలిగి ఉండే ప్రేక్షకుల ముందుకు తీసుకు పోవాలనే ఉద్దేశం కూడా వర్స్-ఇన్-ప్రోగ్రెస్ విభాగానికి ఉందిఇది సినిమా రంగానికి ఎంతో ఉద్వేగ భరితమైన ఘట్టంచలనచిత్ర రంగంలోకి పొలికేక పెడుతూ ప్రవేశించిన ప్రతిభామూర్తులను రెండు చేతులూ చాచి ఆప్యాయంగా ఆహ్వానించడంలో ఫిలిమ్ బజార్ ముందు వరుసలో నిలుస్తోంది.

వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ ను గురించి...

థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో తీసిన సినిమాలను ప్రోత్సహించడానికే అచ్చంగా వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ ను ఏర్పాటు చేశారుఈ విభాగంలో ప్రతి ఏటా గరిష్ఠంగా ఆరు చలన చిత్రాలను ఎంపిక చేస్తూ వస్తున్నారుఆయా చిత్రాల దర్శకులుఎడిటర్లు వారి వారి రఫ్ కట్స్‌ ను ప్రసిద్ధ గురువుల మండలికి నివేదించిఆ గురువులు అందించే అమూల్యమైన సూచనలనూసలహాలనూ అందుకొనే అరుదైన అవకాశాన్ని దక్కించుకొంటారుదేశ విదేశాలలో లబ్ధ ప్రతిష్టులైన ఎడిటర్లు ఎంపిక చేసిన చలనచిత్ర రూపకర్తలకు ఎడిటింగ్ సెషన్లను నిర్వహించి తగిన మార్గదర్శకత్వాన్ని అందించిఆయా దర్శకులు వారి పనితనానికి మెరుగులు పెట్టుకొనేందుకు సాయపడతారుగురువులుగా వ్యవహరించే వారిలో పరిశ్రమలోని వృత్తి నిపుణులుఫిల్మ్ ఫెస్టివల్  డైరెక్టర్లువిమర్శకులునిర్మాతలుతల పండిన ఎడిటర్లు.. ఇలా విభిన్న వర్గాల వారు ఉంటారుసాన పట్టిన ఒక తుది చలన చిత్రాన్ని ఏ విధంగా ఆవిష్కరించాలో వీరంతా కలసి చలనచిత్ర రంగ ఔత్సాహికులకు బోధిస్తారు.

 

వర్క్-ఇన్-ప్రోగ్రెస్ ల్యాబ్ 2008లో ప్రారంభమైనప్పటి నుంచి తీర్చిదిద్దిన చలనచిత్రాలు... ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రీమియర్ (మొట్టమొదటి ప్రదర్శన)కు నోచుకొన్న గౌరవాన్ని పొందాయివిమర్శకుల ప్రశంసలను కూడా రాబట్టుకొన్నాయిఈ భాగ్యాన్ని దక్కించుకొన్న చిత్రాలలో పుతుల్ నాచేర్ ఇతికథ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2023), శివమ్మ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2021, బుసాన్ 2022 విజేత), ఏక్ జగహ్ అప్నీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2021), పోవై  (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2020 ), పాకా (రివర్ ఆఫ్ బ్లడ్ ) (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2020), పెడ్రో (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), శంకర్స్ ఫెయిరీస్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), లైలా ఔర్ సాత్ గీత్ (గొర్రెలను కాపాలా కాసే మహిళ – ఏడు గీతాలు) (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), ఫైర్ ఇన్ ద మౌంటెన్స్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2019), ఈబ్ ఆలే ఊ! (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2018), సోనీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2017), ది గోల్డెన్-లేడెన్ షీప్ అండ్ ది సేకెడ్ మౌంటెన్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2016), లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2015) థీథీ  (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2014), తిత్ లీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2013), కిల్లా  (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2013), తుంబడ్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2012), మిస్ లవ్లీ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2011), ఇంకా షిప్ ఆఫ్ థీసియస్ (డబ్ల్యూఐపీ ల్యాబ్, 2011) లు ఉన్నాయి.

ఫిల్మ్ బజార్‌ ను గురించి…

ఫిలిమ్ బజార్ ఒక బీ2బీ (బిజినెస్ టు బిజినెస్వేదికఇది దక్షిణాసియా ప్రాంత చలనచిత్రాలకు జాతీయ విపణిలోనుఅంతర్జాతీయ విపణిలోను ఆదరణ లభించేటట్లు చొరవ తీసుకొంటుందిఫిల్మ్ బజార్ లో వ్యూయింగ్ రూమ్ ఒక చెల్లింపు ప్రధానమైన వేదికఇది దర్శకులకు వారి చిత్రాన్ని వారంతట వారే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోవరల్డ్ సేల్స్ ఏజెంట్లుఇంకా కొనుగోలుదారులకు ప్రదర్శించుకొని ప్రచారం చేసుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.

 

ఫిలిమ్ బజార్‌ ను గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దయచేసి ఈ కింది లింకులను చూడగలరు:

https://filmbazaarindia.com/the-bazaar/about-film-bazaar/

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2068120

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=2071092

మరింత సమాచారం కోసం ఫిలిమ్ బజార్  బృందాన్ని దయచేసి films@filmbazaarindia.com లో  సంప్రదించవచ్చు.

iffi reel

(Release ID: 2071542) Visitor Counter : 57