ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రముఖ జానపద గాయని శారదా సిన్హా మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 06 NOV 2024 7:40AM by PIB Hyderabad

సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. శారదా సిన్హా పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద గేయాలు అనేక దశాబ్దాలుగా అమిత ప్రజాదరణను పొందాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ముఖ్యంగా గొప్ప భక్తి విశ్వాసానికి గుర్తుగా నిర్వహించే ఛఠ్ పండుగకు సంబంధించి ఆమె పాడిన సుమధుర గీతాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఆయన అన్నారు.


సామాజిక ప్రసార మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘సుప్రసిద్ధ జానపద గాయని శారదా సిన్హా జీ మనను వీడిపోయారని తెలిసి, అత్యంత దుఃఖానికి లోనయ్యాను.  ఆమె పాడిన మైథిలి, భోజ్‌పురి జానపద గేయాలు గడచిన అనేక దశాబ్దాలుగా అమిత ప్రజాదరణకు నోచుకొన్నాయి. భక్తి విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న ఛఠ్ మహా పర్వదినానికి సంబంధించి ఆమె ఆలపించిన సుమధుర గీతాల శ్రావ్యత సదా నిలిచిపోయేదే. ఆమె మన మధ్య నుంచి నిష్క్రమించడం సంగీత ప్రపంచానికి పూడ్చలేని లోటు. ఈ శోక ఘడియలో ఆమె ఆత్మీయులకు, ఆమె ప్రశంసకులకు నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి’’


“सुप्रसिद्ध लोक गायिका शारदा सिन्हा जी के निधन से अत्यंत दुख हुआ है। उनके गाए मैथिली और भोजपुरी के लोकगीत पिछले कई दशकों से बेहद लोकप्रिय रहे हैं। आस्था के महापर्व छठ से जुड़े उनके सुमधुर गीतों की गूंज भी सदैव बनी रहेगी। उनका जाना संगीत जगत के लिए एक अपूरणीय क्षति है। शोक की इस घड़ी में मेरी संवेदनाएं उनके परिजनों और प्रशंसकों के साथ हैं। ओम शांति!”

****

MJPS/SR


(Release ID: 2071086) Visitor Counter : 35