పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విమానయాన రంగానికి చెందిన 51 మంది మహిళా విజేతలతో కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు భేటీ

Posted On: 05 NOV 2024 6:52PM by PIB Hyderabad

“ప్రజలతో రాష్ట్రపతి” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పౌర విమానయాన రంగానికి చెందిన 51 మంది మహిళా విజేతలను కలుసుకున్నారు. వీరిలో పైలెట్లు, విమాన సహాయ సిబ్బంది, సాంకేతిక సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు, మెయింటెనెన్స్ ఇంజినీర్లు, విమానాశ్రయ నిర్వహణ, నియంత్రణ అధికారిణులు ఉన్నారు.



మహిళా విజేతలందరికీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో విందు ఏర్పాటైంది. ఈ సందర్భంగా మహిళా విజేతలతో ముచ్చటించిన మంత్రి, వారి విజయగాథలను ఆసక్తిగా విన్నారు. వారి దీక్ష, పట్టుదల, స్థైర్యాన్ని ప్రశంసించిన మంత్రి, తమ విజయ సందేశాన్ని దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేర్చాలని, తద్వారా గ్రామాల్లోని  యువతులు విమానయాన రంగంలో ప్రవేశించేందుకు తగిన స్ఫూర్తినందించాలని మహిళా విజేతలకు విజ్ఞప్తి చేశారు.  

 



మహిళలనుద్దేశించి ప్రసంగిస్తూ, “ నేటి ఈ భేటీ ఎంతో ముఖ్యమైనది. పౌర విమానయాన రంగంలో ప్రతిభ చూపిన వీరందరూ ఎన్నో సవాళ్ళను అధిగమించి, మూస పద్ధతులని తోసిపుచ్చిన ధీర వనితలు. పారంపర్యంగా పురుషుల ప్రాబల్యం గల రంగంలో నాయకత్వ స్థాయికి ఎదిగిన వీరిని ప్రభుత్వం సత్కరిస్తోంది” అని మంత్రి హర్షాన్ని వెలిబుచ్చారు.  పౌర విమానయాన శాఖ కార్యదర్శి శ్రీ వుమ్లుంగ్మంగ్ వోల్నామ్, ఇతర సీనియర్ అధికారులు కార్యక్రమానికి హాజరయ్యారు.  

 

*****


(Release ID: 2071030) Visitor Counter : 30


Read this release in: English , Urdu , Hindi , Tamil