లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

దేశబంధు చిత్తరంజన్ దాస్ జయంతి సందర్భంగా పార్లమెంటేరియన్ల నివాళి

प्रविष्टि तिथि: 05 NOV 2024 3:33PM by PIB Hyderabad

దేశబంధు చిత్తరంజన్ దాస్ జయంతి సందర్భంగా సంవిధాన్ సదన్ లోని సెంట్రల్ హాల్లో ఆయన చిత్రపటం వద్ద ఈ రోజు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, ఇతర పార్లమెంటేరియన్లు పుష్పాంజలి ఘటించారు. పార్లమెంటు సభ్యులు, లోక్ సభ సెక్రటేరియట్, రాజ్యసభ సెక్రటేరియట్ లకు చెందిన సీనియర్ అధికారులు, ఇతరులు.. చిత్తరంజన్ దాస్ కు నివాళులు అర్పించారు. 

ఈ సందర్భంగా చిత్తరంజన్ దాస్ జీవిత వివరాలతో కూడిన చిన్న పుస్తకాన్ని హిందీ, ఇంగ్లిషు భాషల్లో లోక్ సభ సెక్రటేరియట్ ప్రచురించింది. కార్యక్రమానికి హాజరైన ఆహూతులందరికీ ఈ చిన్ని పుస్తకాన్ని బహూకరించారు. 

 

నవంబరు 5, 2024 దేశబంధు చిత్తరంజన్ దాస్ జయంతి సందర్భంగా సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నివాళి అర్పిస్తున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా. 

 

 

సంవిధాన్ సదన్- సెంట్రల్ హాల్లోని దేశబంధు చిత్తరంజన్ దాస్ చిత్ర పటం వద్ద నివాళి అర్పించిన అనంతరం… లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, పార్లమెంటు సభ్యులు, ఇతర అతిధులు.

1958, సెప్టెంబరు 12వ తేదీన అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ దేశబంధు చిత్తరంజన్ దాస్ చిత్రపటాన్ని సంవిధాన్ సదన్ లోని సెంట్రల్ హాల్లో ఆవిష్కరించారు. 

 

***


(रिलीज़ आईडी: 2070907) आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Tamil