సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మేళనం (వేవ్స్) కంటే ముందే ఊపందుకున్న క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ – సీజన్ 1

క్రియేటర్ ఎకానమీలో చేరండి: క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడానికి

ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోండి, అంతర్జాతీయ వేదికపై మీ ప్రతిభను ప్రదర్శించండి


క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ కు పది వేలకు పైగా దరఖాస్తులు: దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆసక్తి
పోటీదారులను ఆకర్షిస్తున్న దేశవ్యాప్త రోడ్ షోలు, ప్రధాన నగరాల్లోని విద్యార్థుల, నిపుణుల బలోపేతం

Posted On: 04 NOV 2024 4:38PM by PIB Hyderabad

క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ - సీజన్ 1 (సీఐసీ)కి అపూర్వ స్పందన రావడంపై భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మేళనం (వేవ్స్) కంటే ముందే సీఐసీ జరుగుతుంది. వేవ్స్ కార్యక్రమం ఆధారంగా రూపొందించిన క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్, సృజనాత్మక వ్యక్తీకరణ, ఆవిష్కరణలకు వేదికను కల్పించడం ద్వారా ఈ లక్ష్యానికి జీవం పోసింది.

దేశీయంగా క్రియేటర్ ఎకానమీ మెరుగయ్యేలా ప్రభావాన్ని చూపడం, కంటెంట్ సృష్టికర్తలు, ఆవిష్కర్తలు తమ ప్రతిభను ప్రదర్శించి, నైపుణ్యాలను ఉపయోగించి ఆర్జించడం, తద్వారా భారతీయ మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి దోహదపడటమే లక్ష్యంగా సీఐసీని రూపొందించారుఇది ఈ రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే సృజనాత్మకత కలిగిన ప్రతిభావంతులకు ప్రయోగ కేంద్రంగా పనిచేసి, వారిని అంతర్జాతీయ గుర్తింపు దిశగా నడిపిస్తుంది.

అన్ని పోటీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సిన వేవ్స్ వెబ్‌సైట్: https://wavesindia.org/challenges-2025

 

సీఐసీ: ఆవిష్కరణలకు విభిన్నమైన వేదిక

ఆగస్ట్ 22, 2024న ప్రారంభమైన సీఐసీ, 27 విభిన్న అంశాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీదారులను ఆకర్షిస్తోంది. ట్రూత్ టెల్ హ్యాకథాన్, కామిక్స్ క్రియేటర్ ఛాంపియన్‌షిప్, ఈ-స్పోర్ట్స్ టోర్నమెంట్, ట్రైలర్ మేకింగ్ కాంపిటీషన్, థీమ్ మ్యూజిక్ కాంపిటీషన్, ఎక్స్‌ఆర్ క్రియేటర్ హ్యాకథాన్, ఏఐ అవతార్ క్రియేటర్, యానిమి ఛాలెంజ్ సహా ఇతర అంశాల్లో పోటీలు జరుగుతాయి.

మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రసారాలు, ప్రకటనలు, సంగీతం, ఏవీజీసీ-ఎక్స్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, సినిమాలు, నూతన టెక్నాలజీలతో సహా ఇతర విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు.

ఉత్సాహంగా సీఐసీ కార్యకలాపాలు

దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి సంఖ్యను పెంచడానికి  వివిధ సంస్థల సహకారంతో రోడ్ షోలను విజయవంతంగా నిర్వహించారు. ఇండియా గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) తోడ్పాటుతో సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో 50 మంది నిపుణులతో సహా 250 మందికి పైగా పాల్గొన్నారు. ఏవీజీసీ రంగం ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ ఫిక్కీ సహకారంతో సెప్టెంబరు 28న జరిగిన చెన్నై వేగాస్ ఫెస్ట్ 5,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించింది. అలాగే అక్టోబర్ 5న మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎంఈఏఐ), ఏబీఏఐ ఏవీజీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)తో కలిసి బెంగళూరులో రోడ్‌షో నిర్వహించారు. ఈ రంగానికి చెందిన 40-50 సంస్థలు, అసోషియేషన్ల మధ్య విలువైన చర్చలకు వేదికగా ఈ కార్యక్రమం నిలిచింది.

త్వరలో జరగబోయే క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ (CIC) సీజన్ – 1, ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మేళనం (వేవ్స్)లో విస్తృత స్థాయిలో ప్రేక్షకులు, భారతీయ సృజనాత్మక సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు దేశమంతటా మీడియా, వినోద కార్యక్రమాలను చేపడుతూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చురుకుగా వ్యవహరిస్తోంది.

ఇప్పటి వరకు ఈ పోటీలకు 10 వేల కంటె ఎక్కువగానే రిజిస్ట్రేషన్లు వచ్చాయి. ఈ సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ విజయాన్ని పునాదిగా చేసుకుని దేశవ్యాప్తంగా రోడ్ షోలు నిర్వహించేందుకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. యువత, విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు ఉన్నత విద్యాసంస్థలతో కలసి పనిచేస్తోంది. సృజనాత్మక రంగాలైన డిజిటల్ మీడియా, ఏవీజీసీ, తదితర నూతన టెక్నాలజీల సామర్థ్యాన్ని విద్యార్థులు, వర్థమాన సృష్టికర్తలు గుర్తించేలా చేయడంతో పాటు, ఈ రంగాల్లో వారిని ప్రోత్సహించేందుకు తోడ్పడుతుంది.

వేవ్స్, క్రియేట్ ఇన్ ఇండియా ఛాలెంజ్ ప్రభావాన్ని మరింత విస్తరించేందుకు, విస్తృత ప్రచారం దిశగా మంత్రిత్వ శాఖ ప్రణాళిక రచిస్తోంది. దీనిలో భాగంగా సోషల్ మీడియా భాగస్వామ్యాలతో పాటు దేశవ్యాప్తంగా 28 చోట్ల రోడ్ షోలు నిర్వహిస్తుంది. వీటితోపాటు  అంతర్జాతీయ స్థాయిలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లోనూ రోడ్ షోలు నిర్వహిస్తారు.  ఇవి పోటీదారుల్లో ఉత్సుకతను కల్పించి, ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్యను పెంచుతాయి.

 

****


(Release ID: 2070768) Visitor Counter : 18