నౌకారవాణా మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

చెన్నై ఓడరేవులో ఇప్పుడున్న సౌకర్యాలకు తోడు రూ.187 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులు;


కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ చేతుల మీదుగా ప్రారంభం

చెన్నై ఓడరేవులో కొత్త తీరప్రాంత రహదారి, ఎగుమతులు- దిగుమతులకు ఉద్దేశించిన గోదాములు, తీరప్రాంతంలో విద్యుత్తు సదుపాయాలు

రైలుమార్గం డబ్లింగు పని, సరకు రవాణా సామర్థ్య విస్తరణలతో
పెరగనున్న చెన్నై పోర్టు, కామరాజర్ పోర్టు ల వ్యాపార సామర్థ్యం

భారతదేశ నౌకావాణిజ్య సదుపాయాలను పెంచడం, దీర్ఘకాలం పాటు మన్నే పద్ధతులపై తదేక శ్రద్ధ.. ఇవే మా నిబద్ధత; అందుకు నిదర్శనమే ఈ ప్రాజెక్టులు: శ్రీ సొనోవాల్

Posted On: 04 NOV 2024 3:32PM by PIB Hyderabad

కేంద్ర ఓడరేవులు, నౌకారవాణా, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సొనోవాల్ ఈ రోజు చెన్నైలో పర్యటించారు.  చెన్నై పోర్ట్ అథారిటీ (సిహెచ్‌పీఏ)లో, కామరాజర్ పోర్ట్ లిమిటెడ్ (కేపీఎల్)లో అనేక ముఖ్య ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు.  మొత్తం రూ.187.33 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులను మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టులు  ఓడరేవుల్లో ఇప్పుడున్న వసతి సౌకర్యాలను మరింత పెంచి, వ్యాపార కార్యకలాపాలు ఇంకా సాఫీగా జరిగేటట్లు చూడటంతో పాటు భారతదేశం ప్రాధాన్యమిస్తున్న గ్రీన్ పోర్ట్‌ కార్యక్రమాలను ఇంకా ముందుకు తీసుకుపోనున్నాయి.

ఓడరేవులను ఆధునికీకరించడానికి, నౌకావాణిజ్యానికి అవసరమయ్యే సంధాన సదుపాయాల్ని పెంచడానికి తమ మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు.  ప్రపంచ వ్యాపారంలో భారతదేశాన్ని ఒక కీలక పాత్రధారిగా నిలబెట్టడంలో ఈ ప్రాజెక్టులది ముఖ్య పాత్ర అని ఆయన అన్నారు.

 

అధిక ప్రభావాన్ని చూపే అనేక ప్రాజెక్టులను కేంద్ర మంత్రి ప్రారంభించారు.  ఈ ప్రాజెక్టుల్లో ఎగుమతి - దిగుమతులకు ఉద్దేశించిన 4 కొత్త గోదాములను  రూ.73.91 కోట్ల ఖర్చుతో చెన్నై పోర్టులో నిర్మించడం కూడా ఒకటిగా ఉంది. ఈ గోదాములు 18,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటవుతూ వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు సహా ఇతర ముఖ్య సరకులను నిలవ చేయడానికే ప్రత్యేకించిన, పైకప్పుతో కూడిన నిలవ వసతిని కలిగి ఉంటాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులన్నిటిని సాగర్‌మాల పథకంలో భాగంగా అందించనున్నారు.  ఈ ప్రాజెక్టును పెరుగుతున్న గిరాకీకి తగ్గట్టు ప్రధాన ఓడరేవుల్లో వ్యాపార సామర్థ్యాన్ని విస్తరించాలన్న భారతదేశం లక్ష్యానికి అనుగుణంగా రూపొందించారు.  350 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులతో ఒక కాంక్రీటు తీరప్రాంత రహదారిని కొత్తగా నిర్మించగా, మంత్రి ఆ రోడ్డును ప్రారంభించి, అంకితం చేశారు.   ఒక్క గోదాములే కాకుండా, రూ.4 కోట్ల ఖర్చుతో అభివృద్ధి పరచిన ఈ కొత్త రహదారి చెన్నై పోర్టులోని రెండో కంటైనర్ టర్మినల్ (సీఐటీపీఎల్) వద్దకు భారీ సరకు రవాణా కంటైనర్‌లు ఎలాంటి ఇబ్బంది లేకుండా తరలి వెళ్ళేందుకు అనువుగా ఉంది.  ఈ కొత్త రోడ్డు పోర్టుకు చేరికను పెంచనుంది;  దుమ్మును, ధూళిని తగ్గించి వేస్తూ పర్యావరణ సంబంధిత నియమాల అనుసరణకు వీలు కల్పిస్తుంది. ఈ రోడ్డు అందుబాటులోకి రావడంతో ఓడరేవులో ఇప్పటికే ఉన్న వసతి, సదుపాయాలు చాలా మెరుగుపడనున్నాయి.

 

 

***




(Release ID: 2070740) Visitor Counter : 12