ఉక్కు మంత్రిత్వ శాఖ
హైదరాబాద్ ఆస్కీతో సెయిల్ అవగాహన ఒప్పందం
Posted On:
04 NOV 2024 3:43PM by PIB Hyderabad
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్), హైదరాబాద్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా-ఆస్కీ (ఏఎస్సీఐ) మధ్య విద్యా సంబంధిత అంశాల్లో సహకారం కోసం న్యూఢిల్లీలోని కంపెనీ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది.
సెయిల్లో పదోన్నతి పొందిన సీనియర్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన నిర్వహణ, అభివృద్ధి అంశాల్లో ఈ ఎంవోయూ దోహదపడుతుంది. ప్రముఖ సంస్థలతో సహకారం... స్థూలంగా సెయిల్ అభ్యసన-అభివృద్ధి వ్యూహంలో ఇది ఒక భాగంగా ఉంది. కంపెనీ కార్యనిర్వాహకులకు మెరుగైన విద్యను అందించడంతోపాటు, నాయకత్వ స్థానాలకు ఎదగడానికి ఉపయోగపడుతుంది.
సెయిల్ డైరెక్టర్ (సిబ్బంది) శ్రీ కె.కె. సింగ్, ఏఎస్సీఐ డైరెక్టర్ డాక్టర్ నిర్మాల్య బాగ్చి సమక్షంలో ఈ ఎంవోయూ కుదిరింది.
(Release ID: 2070649)
Visitor Counter : 43