ప్రధాన మంత్రి కార్యాలయం
క్షయవ్యాధిపై పోరాడడంలో భారత్ సాధిస్తున్న పురోగతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు
Posted On:
03 NOV 2024 3:33PM by PIB Hyderabad
టీబీ వ్యాప్తిని తగ్గించే దిశలో మన దేశం సాధిస్తున్న విజయాలను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. ఇది క్షయవ్యాధి ని నిర్మూలించడానికి భారతదేశం చేస్తున్న కృషికి లభించిన ఒక గొప్ప గుర్తింపు అని చెప్పుకోవచ్చు.
క్షయవ్యాధి వ్యాప్తిని 2015 నుంచి 2023 మధ్య కాలంలో 17.7 శాతం మేరకు భారత్ తగ్గించిందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొనగా, ఇది మన దేశం సాధించిన అసాధారణ ప్రగతికి దక్కిన గుర్తింపు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా తెలిపారు. దీనిపై ప్రధాన మంత్రి సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ, ఈ కింది విధంగా రాసుకొచ్చారు:
‘‘ఇది ప్రశంసించదగ్గ పురోగతి అని చెప్పాలి. భారత్ అంకితభావంతో ఒడిగట్టి కొత్త కొత్త ప్రయత్నాలను కొనసాగిస్తూ పోతున్న ఫలితంగానే టీబీ వ్యాప్తి లో ఈ తగ్గుదల నమోదైంది. మనమందరం ఏకతాటి మీద నిలిచి, టీబీకి తావు ఉండనటువంటి భారత్ ను సాకారం చేసేందుకు పాటుపడుతూనే ఉందాం.’’
***
MJPS/SS
(Release ID: 2070489)
Visitor Counter : 41
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam